Minister: నా ప్రమేయం ఉందని నిరూపిస్తే దేనికైనా సిద్ధం

by Gantepaka Srikanth |   ( Updated:2024-11-26 13:00:20.0  )
Minister: నా ప్రమేయం ఉందని నిరూపిస్తే దేనికైనా సిద్ధం
X

దిశ, వెబ్‌డెస్క్: భూ కబ్జా ఆరోపణలపై మంత్రి వాసంశెట్టి సుభాష్(Vasamsetti Subhash) ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను భూదందా(Land Grabbing)కు సహకరిస్తున్నానని తనపై చేస్తున్న ఆరోపణలను నిరూపించాలని డిమాండ్ చేశారు. నిరూపిస్తే దేనికైనా సిద్ధమని ప్రకటించారు. కావాలనే కొంతమంది మహిళలు తనపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఆరోపణలు నిరూపించకపోతే కేసులు పెడతానని హెచ్చరించారు.

అవినీతికి పాల్పడిన వైసీపీ నేతలు అరెస్టులు అవుతున్నారు. త్వరలో ఓ మాజీ మంత్రి, అతిని కుమారుడు కూడా అరెస్ట్ కాబోతున్నాడని మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను భూకబ్జాకు పాల్పడ్డానని కొంతమంది రామచంద్రాపురంలో ధర్నా చేశారు.. ఆధారాలు ఉంటే జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయాలని అన్నారు. ఓటమిని జీర్ణించుకోలేక, విపక్షంలో ఉండలేక వైసీపీ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.

Next Story

Most Viewed