- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Kothapalli: శిథిలావస్థలో ఇందిరమ్మ ఇండ్లు!.. ఆదరణకు నోచుకోని వైనం
కరీంనగర్ జిల్లాలో నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. కొత్తపల్లి మండలంలోని బద్ధిపల్లి, చింతకుంట, రేకుర్తి గ్రామాల్లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పెద్దఎత్తున ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. లబ్ధిదారులకు 60 గజాల్లో ఇళ్లను నిర్మించి ఇచ్చింది. అయితే కొద్దిరోజులకే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం కోల్పోయి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ పథకం ముందుకు సాగలేదు. కొత్త ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల స్థానంలో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఆ తర్వాత ఈ ఇళ్లకు ఎలాంటి నిధులు కేటాయించలేదు. ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపికలో అక్రమాలు జరిగాయని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం విచారణ చేపట్టింది. దీంతో చాలా వరకు ఇల్లు అసంపూర్తిగానే మిగిలాయి. లబ్దిదారులే అప్పులు తెచ్చి అక్కడక్కడ నిర్మాణాలు పూర్తి చేసుకున్నారు. కానీ ఆ ఇళ్లలో కనీస సౌకర్యాలు లేకపోవడంతో లబ్దిదారులు ఇళ్లలో ఉండేందుకు మొగ్గుచూపడం లేదు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో లబ్దిదారుల్లో ఆశలు చిగురుస్తున్నాయి. అసంపూర్తిగా నిలిచిన ఇళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని లబ్దిదారులు ఎదురు చూస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్లలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.
దిశ, కొత్తపల్లి : కరీంనగర్ జిల్లాలో నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. కొత్తపల్లి మండలంలోని బద్ధిపల్లి, చింతకుంట, రేకుర్తి గ్రామాల్లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పెద్దఎత్తున ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. లబ్ధిదారులకు 60 గజాల్లో ఇళ్లను నిర్మించి ఇచ్చింది. అయితే కొద్దిరోజులకే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం కోల్పోయి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ పథకం ముందుకు సాగలేదు. కొత్త ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల స్థానంలో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఆ తర్వాత ఈ ఇళ్లకు ఎలాంటి నిధులు కేటాయించలేదు. ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపికలో అక్రమాలు జరిగాయని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం విచారణ చేపట్టింది. దీంతో చాలా వరకు ఇల్లు అసంపూర్తిగానే మిగిలాయి. లబ్దిదారులే అప్పులు తెచ్చి అక్కడక్కడ నిర్మాణాలు పూర్తి చేసుకున్నారు. కానీ ఆ ఇళ్లలో కనీస సౌకర్యాలు లేకపోవడంతో లబ్దిదారులు ఇళ్లలో ఉండేందుకు మొగ్గుచూపడం లేదు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో లబ్దిదారుల్లో ఆశలు చిగురుస్తున్నాయి. అసంపూర్తిగా నిలిచిన ఇళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని లబ్దిదారులు ఎదురు చూస్తున్నారు. ఇది ఇలావుండగా పూర్తి చేసుకున్న ఇందిరమ్మ ఇళ్లకు ఇంటి నంబర్లు ఇవ్వడం లేదని కొందరు లబ్ధిదారులు వాపోతున్నారు. దీంతో చాలా వరకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వడం లేదు. ఈ కారణంగా ఇందిరమ్మ కాలనీలు అంధకారంలో ఉన్నాయి. రాత్రి సమయంలో ఏలుగుబంట్లు, విషపూరిత సర్పాలు సంచరిస్తుంటాయని, ఇళ్లలో కనీస సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తమ సమస్యలు పరిష్కారమవుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అప్పులు తెచ్చుకొని ఇళ్లను నిర్మించుకున్నామని లబ్దిదారులు వాపోతున్నారు. తమకు ఇందిరమ్మ ఇళ్లలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.
మౌలిక వసతులు కల్పించాలి..
ఇందిరమ్మ ఇళ్లలో మౌలిక సదుపాయాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఖాళీ ఇళ్లలో పిచ్చి మొక్కలు, చెట్లు ఏపుగా పెరిగాయి. రాత్రివేళలో ఏలుగుబంట్లు, పాములు, తేల్లు వస్తున్నాయి. కనీస సౌకర్యాలు లేకపోవడంతో లబ్ధిదారులు వచ్చేందుకు మొగ్గు చూపడం లేదు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి కనీస సౌకర్యాలు కల్పించాలని బద్దిపల్లి వాసి మాలోతు ముత్యాలు కోరుతున్నారు
చాలా ఇబ్బందులు పడుతున్నాం..
ఇళ్లలో మంచినీటి సమస్య, సీసీ రోడ్లు లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. మా రేకుర్తి గ్రామం కరీంనగర్ కార్పొరేషన్‌లో విలీనం చేశారు. దీంతో ఇందిరమ్మ ఇళ్లకు భారీగా ఇంటి పన్ను విధిస్తున్నారు. కూలి పని చేసుకుని జీవించే మాకు చాలా ఇబ్బందిగా ఉంది. కరీంనగర్‌లో అద్దె ఇళ్లలో కిరాయి చెల్లించలేక ఇక్కడికి వచ్చాం. ప్రధానంగా ఈ సమస్యలు పరిష్కరించాలని రేకుర్తి వాసి ఎండీ జాంగిర్ కోరారు.