విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి.. తహశీల్దార్

by Sumithra |
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి.. తహశీల్దార్
X

దిశ, గుండుమాల్ : నారాయణపేట్ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశాల మేరకు సోమవారం తహశీల్దార్ భాస్కర్ స్వామి వివిధ పాఠశాలలను తనిఖీ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని అన్నారు. మండల కేంద్రంలోని ఆమ్లికుంట, సరంగరావ్ పల్లి, కుమారికుంట తండా, సబ్యానాయక్ తండా, గుండుమాల్ ఆదర్శ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని తహశీల్దార్ పరిశీలించారు. ఆయా పాఠశాలలోని బియ్యం పరిశీలించి.. పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా భాస్కర్ స్వామి మాట్లాడుతూ నాసిరకపు కూరగాయలతో వంటలు చేయవద్దని తెలిపారు. నాణ్యమైన వస్తువులను కొనుగోలు చేసి భోజనాన్ని అందించాలన్నారు. మధ్యాహ్న భోజన పథకంలో నిర్లక్ష్యం వహిస్తే ఎంతటి వారైనా సహించేది లేదని. విద్యతో పాటు నాణ్యమైన ఆహారాన్ని అందించాల్సిన బాధ్యత అధికారుల పై ఉందన్నారు. మెనూ ప్రకారం విద్యార్థులకు ఆహారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల రెవిన్యూ అధికారి వెంకట్రాములు, రికార్డు అసిస్టెంట్ పాండు ఉన్నారు.

Advertisement

Next Story