- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్విమ్మింగ్‌తో వెయిట్ లాస్.. గంటకు 400 కేలరీలు!
దిశ, ఫీచర్స్ : జిమ్‌లో ఎన్ని గంటలు కష్టపడ్డా బరువు తగ్గలేకపోతున్నారా? అయితే స్విమ్మింగ్ ప్రయత్నించండని సూచిస్తున్నారు నిపుణులు. ఈ యాక్టివిటీలో శరీర కండరాలన్నీ పాల్గొంటాయి కాబట్టి అధిక కేలరీల బర్నింగ్‌కు ఇదే ప్రభావవంతమైన మార్గమని, ఫ్లెక్సిబిలిటీని మెరుగుపరచడమే కాక ఒత్తిడిని తగ్గించగలదని చెబుతున్నారు. ఇక 30 నిమిషాలు ఈతకొడితే భూమిపై 45 నిమిషాల వ్యాయామానికి సమానమని స్విమ్ ఇంగ్లండ్ పరిశోధన వెల్లడిస్తుండగా.. దీని ద్వారా గంటకు 400 కేలరీలు బర్న్ చేయొచ్చు. అంతేకాదు గుండె కండరాలను బలోపేతం చేయగలిగే స్విమ్మింగ్.. శరీరమంతా రక్తాన్ని సమర్థవంతంగా పంప్ చేయడంలోనూ సాయపడుతుంది.
ప్రయోజనాలు:
* ఊపిరితిత్తుల ఆరోగ్యంతో పాటు కఠిన పరిస్థితుల్లో శరీరానికి కావలసిన ఓర్పును మెరుగుపరుస్తుంది. కాబట్టి డైలీ వర్కవుట్స్‌లో తప్పనిసరిగా స్విమ్మింగ్‌ను చేర్చుకోవాలి.
* స్విమ్మింగ్ ఎముక ద్రవ్యరాశిని కూడా మెరుగుపరుస్తుంది. ఎలుకలపై నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం ఎటువంటి వ్యాయామంలేని సమూహంతో పోలిస్తే ఈత, పరుగును ప్రేరణగా కలిగిన ఎలుకల సమూహంలో ఎముక ఖనిజ సాంద్రత మెరుగుపడింది.
* ఈత మిమ్మల్ని యవ్వనంగా ఉంచుతుంది. భారతీయ విశ్వవిద్యాలయం నిర్వహించిన పరిశోధన ప్రకారం జీవశాస్త్రపరంగా, సాధారణ ఈతగాళ్లు వారి వాస్తవ వయస్సు కంటే యంగ్‌గా కనిపిస్తారు. హృదయ పనితీరు, కండర ద్రవ్యరాశి, జ్ఞాపకశక్తి, కేంద్ర నాడీ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలతో పాటు రక్తపోటును తగ్గిస్తుంది.
* ఈత కొట్టినప్పుడు శరీరం మొత్తం పని చేస్తుంది కాబట్టి ఈ వ్యాయామం సుఖ నిద్రకు తోడ్పడుతుంది. అందుకే రెగ్యులర్ ఈతగాళ్లలో త్వరగా నిద్రలేవడం లేదా నిద్రలేమి వంటి సమస్యలు చాలా అరుదుగా కనిపిస్తాయి.
* స్విమ్మింగ్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. శరీరంలో అనేక రకాల చెడు కొలెస్ట్రాల్‌తో పాటు రక్తపోటును తగ్గిస్తుంది. రోజువారీ వర్కవుట్స్‌లో స్విమ్మింగ్‌ను చేర్చుకోవడం వల్ల స్ట్రోక్, డయాబెటిస్ తదితర వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది.