- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చేపలు తింటే చర్మ క్యాన్సర్..
దిశ, ఫీచర్స్: చేపలు ఆరోగ్యానికి మంచివని, డైలీ ఫుడ్‌లో చేర్చుకుంటే మెరుగైన ఫలితాలు ఉంటాయని డాక్టర్లు సూచిస్తారు. కానీ చేపలను అధిక మొత్తంలో తీసుకుంటే క్యాన్సర్ ప్రమాదానికి దారితీస్తుందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. సాధారణంగా అతినీలలోహిత (UV) కిరణాలకు బహిర్గతమైన చర్మ కణాల్లోని డీఎన్‌ఏ డ్యామేజ్ అవడం మూలంగా స్కిన్ క్యాన్సర్ వస్తుంది. కానీ చేపలు తినడం వల్ల కూడా మెలనోమా ప్రమాదముందని హెచ్చరిస్తోంది లేటెస్ట్ రీసెర్చ్.
బ్రౌన్ యూనివర్సిటీ అధ్యయనం ప్రకారం.. సాధారణంగా చేపలను ఆహారంగా తీసుకునే వారి కంటే వారానికి 300గ్రా చొప్పున తీసుకునే వ్యక్తుల్లో ప్రాణాంతక మెలనోమా డెవలప్ అయ్యే అవకాశం 22% ఎక్కువగా ఉంది. పిగ్మెంట్ సెల్స్ అనియంత్రిత పెరుగుదలే ఈ మెలనోమాకు కారణం అవుతుంది. దాదాపు 491,367 మందిపై చేసిన అధ్యయనంలో.. వేయించిన, వేయించని చేపలు ఎంత మోతాదులో తీసుకున్నారనే విషయాలతో పాటు వాటి పరిణామాలపై ఫోకస్ చేశారు. వ్యక్తి బరువు, ధూమపానం లేదా మద్యపానం, తీసుకునే ఆహారం, క్యాన్సర్ ఫ్యామిలీ హిస్టరీ, సగటు UV రేడియేషన్ స్థాయిలు వంటి ఫలితాలను ప్రభావితం చేసే అంశాలను కూడా పరిశోధకులు పరిగణనలోకి తీసుకున్నారు. మొత్తం మీద అధ్యయన సమయంలో 1% మంది ప్రాణాంతక మెలనోమాను అభివృద్ధి చేశారని, 0.7% మందిలో స్టేజ్ 0 మెలనోమా డెవలప్ అవుతుందని కనుగొన్నారు.
మొత్తానికి వేయించని చేపలు తిన్న వారిలో ప్రాణాంతక మెలనోమా ప్రమాదం 18% ఎక్కువ ఉండగా.. స్టేజ్ 0 మెలనోమా రిస్క్ 25% అధికంగా ఉంది. ఇక శ్వేతజాతీయుల్లో 38 మందిలో ఒకరికి మెలనోమా సంక్రమించే అవకాశం ఉండగా.. నల్లజాతీయుల్లో వెయ్యి మందిలో ఒకరికి వచ్చే అవకాశం ఉన్నట్లు వివరించారు. శరీరంపై పుట్టుమచ్చల్లో తేడాను గమనిస్తే కచ్చితంగా డాక్టర్‌ను సంప్రదించాల్సిన అవసరముందని సూచించారు.