'విషజ్వరాల బారిన పడుతున్నరు.. కొంచెం వాళ్లను పట్టించుకోండి'

by GSrikanth |
విషజ్వరాల బారిన పడుతున్నరు.. కొంచెం వాళ్లను పట్టించుకోండి
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో వివిధ ప్రాంతాల నుంచి బతుకుతెరువు కోసం వచ్చిన ప్రజలు అనేకమంది జీవిస్తుంటారు. ముఖ్యంగా నగరంలోని బేగంబజార్, అఫ్జల్‌గంజ్, ఉస్మాన్ గంజ్, ఎంజే మార్కెట్ తదితర ప్రాంతాల్లో ఎక్కువగా వ్యాపారాలు జరగుతుండటంతో చాలామంది అక్కడే నివసిస్తుంటారు. వెల్లుల్లి, ఉల్లి, మిర్చి, పసుపు తదితర వస్తువులను హోల్ సేల్‌లో విక్రయిస్తుంటారు. దీంతో నిత్యం లక్షల మంది ఈ ప్రాంతానికి వచ్చిపోతుంటారు. ఈ క్రమంలో ప్లాస్టిక్ వ్యర్థాలు, ఇతర చెత్తా అక్కడ ఉన్న డ్రైనేజీలో భారీగా పేరుకుపోతోంది.

దీనిపై మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేస్తూ దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికి నెటిజన్లు స్పందిస్తూ.. మున్సిపల్ అధికారులు ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, దీంతో అక్కడి ప్రజలు విషజ్వరాల భారిన పడి ఇబ్బందులు పడుతున్నారని ఆరోపిస్తున్నారు. అయితే, మరికొందరు మాత్రం ఈ ప్రాంతంలో చాలా చోట్ల డస్ట్ బిన్స్ ఏర్పాటు చేయాలని విన్నవిస్తున్నారు.

Advertisement

Next Story