- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'అంబేద్కర్ చేసిన త్యాగం ప్రపంచంలో ఎవరూ చేయలేరు'
దిశ, మక్తల్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోరుకున్న రాజ్యాన్ని తెలంగాణలో నిర్మిస్తామని డీఎస్పీ అధినేత డాక్టర్ విశారదన్ మహారాజ్ అన్నారు. గురువారం మక్తల్ మండలంలోని కాట్రపల్లి, బూత్పూర్ గ్రామాల్లో అంబేద్కర్ జయంతి వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న విశారదన్ మహారాజ్ మాట్లాడుతూ.. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం లేకపోతే పీడిత, అణగారిన వర్గాలకు అన్ని రంగంల్లోనూ భాగస్వామ్యం ఉండేది కాదన్నారు. ప్రపంచంలో ఎవ్వరూ చేయనంత త్యాగం చేసి మన ఓటు హక్కు ఇచ్చిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అన్నారు. ఆ ఓటు హక్కను సక్రమంగా ఉపయోగంచుకున్నప్పుడే సరైన పాలకులు బయటకొస్తారని తెలిపారు.
గ్రామ గ్రామాన అంబేద్కర్ విగ్రహాలు ఏర్పాటు చేయడమే కాదని, ఆయన ఆశయాల సాధన కోసం కృషి చేయాలని సూచించారు. కాగా, విశారదన్ మహారాజ్ చేపట్టిన మహా పాదయాత్ర పదివేల కిలోమీటర్లకు చేరుకున్న సందర్భంగా సభ నిర్వహించారు. ఈ యాత్ర తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలో 500 రోజులు కొనసాగి లక్షల మంది సభతో ముగుస్తుందన్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో డీఎస్పీ జెండా దిమ్మెలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రాష్ట్ర ప్రతినిధులు రాజ్ కమల్, లక్ష్మణ్ శివన్, జిల్లా ఇన్‌చార్జి దుర్గం శ్రీనివాస్, బీసీ నాయకులు రామాంజీ వాల్మీకి, అంజప్ప, ఎల్ భీమప్ప, డీఎస్పీ అధ్యక్షుడు ఈశ్వర్, ఓబులేశు, వెంకటేశు రామాంజీ, రాము, కే.కురుమూర్తి, చరణ్, దేవన్ తదితరులు పాల్గొన్నారు.