- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మెటావర్స్‌లో తొలి ఏటీఎం ప్రారంభించనున్న డీసెంట్రల్యాండ్!
దిశ, ఫీచర్స్ : మెటావర్స్ ప్రస్థావన మొదలైనప్పటి నుంచి వాస్తవ ప్రపంచాన్ని వర్చువల్‌గా పునఃసృష్టించేదుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే మెటావర్స్‌లో పనిచేసే ఫార్మసీలు, బ్యాంకులు, రియల్‌ఎస్టేట్, కార్ సర్వీస్ తదితర బిజినెస్ ప్రకటనల తర్వాత ఇప్పుడు ఏటీఎం రాబోతుంది. ఈథెరియం బ్లాక్‌చైన్ ఆధారిత ప్రముఖ వర్చువల్ రియాలిటీ మెటావర్స్ ప్లాట్‌ఫామ్ అయిన 'డిసెంట్రల్యాండ్' ప్రపంచంలోనే మొట్టమొదటి మెటావర్స్ ATMని ప్రారంభిస్తోంది.
బ్యాంకింగ్ వ్యవస్థలో 'డిజిటల్ పేమెంట్స్' అభివృద్ధి చెందిన తర్వాత భౌతికంగా డెబిట్ కార్డు అవసరం లేకుండా పోయింది. ఇక ఇప్పుడు వర్చువల్ బ్యాంక్స్ రాకతో ఏటీఎంలు కూడా వర్చువల్‌గా మారబోతున్నాయి. ఈ మేరకు ప్రపంచంలోని మొట్టమొదటి మెటావర్స్ ATMను ప్రారంభించేందుకు పేమెంట్ గేట్‌వే డిసెంట్రల్యాండ్ ట్రాన్సాక్.. మెటావర్స్ ఆర్కిటెక్ట్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ట్రాన్సాక్ ఏటీఎమ్ అనేది స్థానిక క్రిప్టోకరెన్సీ అయిన 'మన(MANA)'తో పాటు ఏదైనా ఇతర క్రిప్టోకరెన్సీని కొనుగోలు చేసేందుకు కస్టమర్స్‌ను అనుమతిస్తుంది.
మెటావర్స్‌కు పెరుగుతున్న ప్రజాదరణ, సంభావ్యతతో ప్రపంచవ్యాప్తంగా పలు ప్రముఖ బ్యాంకులు కూడా వర్చువల్ ప్రపంచంలోకి ప్రవేశించాలని నిర్ణయించుకున్నాయి.
ఈ మేరకు అంతర్జాతీయ బ్యాంకింగ్ దిగ్గజం HSBC మెటావర్స్ గేమ్ ప్లాట్‌ఫామ్ డెవలపర్‌గా శాండ్‌బాక్స్‌తో భాగస్వామ్యం ఏర్పరుచుకోగా, మరోవైపు బ్యాంకింగ్ దిగ్గజం జేపీ మోర్గాన్ కూడా డీసెంట్రల్యాండ్‌తో జతకట్టింది. JP మోర్గాన్ డిసెంట్రల్యాండ్ ప్లాట్‌ఫామ్‌లో తన మొదటి మెటావర్స్‌ను ప్రారంభించనుంది. ఇదే కాదు అడిడాస్, నైకీ, సామ్‌సంగ్, అటారీ వంటి అనేక ప్రముఖ కంపెనీలు ఇప్పటికే మెటావర్స్‌లోకి ప్రవేశించాయి. వారు కార్పొరేట్ ప్రయోజనాల కోసం మెటావర్స్‌లో వర్చువల్ ప్రాపర్టీస్ కూడా కలిగి ఉన్నారు.