- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జూనియర్ లైన్ మెన్స్‌ను విధుల్లోకి తీసుకోవాలి: సీపీఐ
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా 2006-07 సంవత్సరంలో క్వాలిఫై అయిన నియామకాలు చేపట్టని జూనియర్ లైన్‌మెన్స్‌ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. రాష్ట్ర వ్యాప్తంగా 2006-07 సంవత్సరంలో జూనియర్ లైన్‌మెన్స్ నోటిఫికేషన్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందని, ఆ నోటిఫికేషన్ ప్రకారం లైన్‌మెన్స్‌గా క్వాలిఫైడ్ అయిన 1800 మందిని విధుల్లోకి తీసుకోలేదని అన్నారు.
దీంతో అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారని తెలిపారు. 2008 లో హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం 2011 సంవత్సరంలో 1175 మంది లైన్‌మెన్స్‌కు ఉద్యోగాలు ఇచ్చారని, మిగితా 650 మందిని ఉద్యోగ ఖాళీలు లేవనే సాకుతో పక్కన పెట్టారని అన్నారు.
వారికి భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని స్పీకింగ్ లెటర్స్ ఇచ్చారని ఇచ్చారని గుర్తు చేశారు. అయిన వారికి ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారని, పీఆర్‌సీ-2018 ప్రకటించే క్రమంలో సుప్రీంకోర్టుకు వెళ్ళిన అభ్యర్థులు కేసులు ఉపసంహరించుకుంటే వారికి ఉద్యోగాలు ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారని, ఆ హామీ మేరకు సుప్రీంకోర్టు నుంచి కేసును విత్‌డ్రా చేశారని పేర్కొన్నారు.
కాని ఇప్పటి వరకు విత్‌డ్రా చేసుకున్న అభ్యర్ధులకు ఉద్యోగాలు కల్పించలేదన్నారు. దీంతో వారిలో నిరుత్సాహం, నిరాశ పెరుగుతుందన్నారు. సీఎం ఇచ్చిన హామీ మేరకు జూనియర్ లైన్‌మెన్స్‌లో క్వాలిఫైడ్ అయ్యి, ఉద్యోగాలు ఇవ్వని అభ్యర్థులకు నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు.