Veena Vani: వీణ-వాణిలకు ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫస్ట్ క్లాస్‌ మార్కులు

by Sathputhe Rajesh |   ( Updated:2022-06-28 11:02:12.0  )
Conjoined Twins Veena Vani Passed In Inter Exams
X

దిశ, తెలంగాణ బ్యూరో: Conjoined Twins Veena Vani Passed In Inter Exams| నేడు విడుదలైన ఇంటర్ ఫలితాల్లో అవిభక్త కవలలైన ఇంటర్మీడియట్ వీణ-వాణిలు ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫస్ట్ క్లాస్‌(Veena - 712, Vani - 707 (CEC)) మార్కులతో ఉత్తీర్ణత సాధించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గిరిజన,స్త్రీ-శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ వీణ-వాణిలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. వారి భవిష్యత్తుకు అవసరమైన అన్ని సదుపాయాలను కల్పిస్తామన్నారు. వారి కలలను సాకారం చేసుకోవడానికి ఈ ప్రభుత్వం సహకారం అందిస్తుందని తెలియజేశారు. వీణ-వాణిలకు సహాకారం అందించిన అధికారులకు మంత్రి సత్యవతి రాథోడ్ ప్రత్యేక అభినందనలు తెలిపారు.


Advertisement

Next Story