వారంలోనే 50 వేల పడకల ఆస్పత్రిని నిర్మించిన చైనా..

by Harish |   ( Updated:2022-04-11 13:51:08.0  )
వారంలోనే 50 వేల పడకల ఆస్పత్రిని నిర్మించిన చైనా..
X

దిశ, వెబ్ డెస్క్ : కరోనా పుట్టినిల్లు చైనా లో కొవిడ్ కేసులు గతంలో కంటే ఇప్పుడు మరింత పెరుగుతున్నాయి. కరోనా కేసులు ఎక్కువగా వెలుగులోకి వచ్చిన ప్రాంతంలో ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. చైనాలో ఉన్న రద్దీ దృష్ట్యా, జనాభా వల్ల భారీ ఆంక్షలను పెట్టింది. ఇంతకుముందు చైనాలో కొన్ని నగరాల్లో ఎగ్జిబిషన్ కేంద్రాలను ఆస్పత్రులు గా మార్చారు. ఇలాంటిదే మరోసారి చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది అక్కడి ప్రభుత్వం. చైనాలో కరోనా విజృంభిస్తున్న వేళ వారం రోజుల్లోనే 50 వేల పడకలతో ఆసుపత్రిని నిర్మించి అద్భుతాన్ని సృష్టించింది. మొన్నటి వరకు ప్రపంచ దేశాలను వణికించిన కరోనా ఇప్పుడు చైనాలో విజృంభిస్తుంది. కరోనా బాధితుల సంఖ్య రోజు రోజుకు భారీగా పెరుగుతున్న కారణంగా రోగుల కోసం తాత్కాలిక ఆసుపత్రిని వినియోగంలోకి తెచ్చింది. బాధితులకు సరైన వైద్య సౌకర్యాలతో కూడిన ఆసుపత్రిని వారం రోజుల్లోనే నిర్మించింది. ఈ నెల 3వ తేదీన పనులు చేపట్టి 9వ తేదీకి పూర్తి చేసి వినియోగంలోకి తెచ్చింది.

Advertisement

Next Story