- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Drugs Prices: ఔషధ ధరలపై కేంద్రం కీలక నిర్ణయం ?
దిశ, వెబ్‌డెస్క్ : Central Government Expected to Stabilize Prices of Drugs| దీర్ఘకాలక వ్యాధులతో బాధపడే వారు జీవితాంతం మందులు వాడాల్సి ఉంటుంది. అయితే వీటికి అయ్యే ఖర్చును మధ్యతరగతి ప్రజలకు భారంగా మారుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక ముందుడుగు వేస్తోంది. దీర్ఘకాలిక వ్యాధులకు వాడే ఔషధాల ధరల స్థిరీకరణపై దృష్టి సారించిన కేంద్రం.. ఔషద కంపెనీలు ఇష్టరీతిలో ధరలు పెంచకుండా ఉండేందుకు కళ్లెం వేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం చర్చించేందుకు ఔషధ కంపెనీలను కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. కేంద్ర రసాయన మంత్రిత్వ శాఖ ఇవాళ ఔషధ కంపెనీలతో సమావేశం కానున్నారు. దీర్ఘకాలిక వ్యాధుల మందుల ధరలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం.
క్యాన్సర్, కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధులు, ఇన్‌ఫెక్షన్ నివారణ మందుల ధరల నియంత్రణపై ఔషధ కంపెనీలతో అధికారులు చర్చించనున్నారు. ఈ చర్చలకు రావాల్సిందిగా అన్ని ఫార్మాస్యూటికల్ కంపెనీలు, ఆరోగ్య మంత్రిత్వ శాఖ, అంప్ప, డ్రగ్ రెగ్యులేటర్లను అధికారులు ఆహ్వానించారు. దీర్ఘకాలక వ్యాధుల బారిన పడితే జీవితాంతం మందులు వాడాల్సిన పరిస్థితి ఉంటుంది. వీటి ఖర్చులు సామాన్య ప్రజలకు భారంగా మారుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుని ఔషధ కంపెనీలు ధరలు పెంచకుండా కేంద్రం చర్యలు తీసుకునే యోచనలో ఉంది. కాగా, ఈ నెలారంభంలో 84 రగాల అత్యవసర ఔషధ ధరలను స్థిరీకరిస్తూ ఎన్ పీపీఏ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. రక్తపోటు, మధుమేహం, జీర్ణాశయ సమస్యలు, కొలెస్ట్రాల్, గుండెపోటు, పక్షవాతం నొప్పినివారణలకు వాడే అతి ముఖ్యమైన ఔషదాల ధరలను సవరించింది. ఫలితంగా వినియోగదారులపై 30-40 శాతం మేరకు భారం తగ్గేలా చర్యలు తీసుకుంది. తాజాగా క్యాన్సర్, కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధులు, ఇన్‌ఫెక్షన్ నివారణ మందుల ధరల నియంత్రణపై చర్చించనున్నారు.
ఇది కూడా చదవండి: 6 లక్షల ఆధార్ కార్డులు రద్దు.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
- Tags
- Drugs Prices