Monkeypox: మంకీపాక్స్ విస్తరణపై కేంద్రం అత్యవసర సమావేశం

by Nagaya |   ( Updated:2022-08-04 11:04:13.0  )
Center Emergency meeting to Contain Spread of Monkeypox Infection
X

దిశ, డైనమిక్ బ్యూరో : Center Emergency meeting to Contain Spread of Monkeypox Infection| దేశంలో మంకీపాక్స్‌ విస్తరిస్తుంది. ఇప్పటికే తొమ్మిది కేసులు నమోదు కాగా, కేరళలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మంకీపాక్స్‌ మేనేజ్‌మెంట్‌ గైడెలైన్స్‌ను సవరించేందుకు గురువారం ఉన్నతస్థాయి ఆరోగ్య నిపుణులతో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఎమరెన్జీ మెడికల్‌ రిలీఫ్‌ డైరెక్టర్‌ ఎల్‌.స్వస్తి చరణ్‌ అధ్యక్షతన సమావేశం జరుగుతున్నది. నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌, ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైసెన్స్‌, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లూహెచ్‌ఓ) ప్రతినిధులు సైతం భేటీకి హాజరయ్యారు. కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖలో ఓ విభాగమైన ఈఎంఆర్‌ జాతీయ, అంతర్జాతీయంగా ప్రజారోగ్య విషయాలను పర్యవేక్షిస్తూ ఉంటుంది.

దేశంలో మంకీపాక్స్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గైడెల్స్‌ను సవరించేందుకు సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. ప్రజలు భయపడవద్దని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా అన్నారు. వ్యాధి వ్యాప్తిని నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అవగాహన ప్రచారం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆగస్టు 2 వరకు 100 నమూనాలను పరీక్షించినట్లు పూణేలోని డాక్టర్ ప్రజ్ఞా యాదవ్ సీనియర్ సైంటిస్ట్ తెలిపారు. దేశవ్యాప్తంగా 15 లేబొరేటరీల నెట్‌వర్క్ పరీక్షలు ప్రారంభించబడ్డాయని, మంకీపాక్స్ వ్యాక్సిన్, డయాగ్నస్టిక్ కిట్‌లను అభివృద్ధి చేయడం కోసం వ్యాక్సిన్ తయారీదారులతో భారతదేశం చర్చలు ప్రారంభించింది. వ్యాక్సిన్ కోసం అన్ని విధాల సన్నాహాలు జరుగుతున్నాయని, ఆరోగ్య శాఖ మంత్రితో ఇప్పటికే సీరం సంస్థ తెలిపింది. కాగా, బుధవారం ఢిల్లీలో నైజీరియాకు చెందిన 31 సంవత్సరాల మహిళకు మంకీపాక్స్‌ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. కాగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ మంకీపాక్స్‌ను అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది.

ఇది కూడా చదవండి: ప్రధాని మోడీ, అమిత్ షాపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

Advertisement

Next Story

Most Viewed