110 రోజుల వాలిడిటీతో కొత్త ప్లాన్ తెచ్చిన నెట్‌వర్క్...

by Disha Desk |
110 రోజుల వాలిడిటీతో కొత్త ప్లాన్ తెచ్చిన నెట్‌వర్క్...
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం సర్వీస్ ప్రొవైడర్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను ప్రారంభించింది. తక్కువ ధరలో డేటా, కాలింగ్ ప్రయోజనాలతో పాటు ఎక్కువ కాలం వాలిడిటీ అందిస్తోంది. ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా వంటి ఇతర ప్రముఖ టెలికాం ఆపరేటర్‌లకు ఈ ప్లాన్‌తో పొటీ ఇవ్వనుంది.

తక్కువ ధరలో ప్లాన్‌లను అందించడం ద్వారా వినియోగదారులను ఆకర్షించడమే BSNL లక్ష్యంగా పెట్టుకుంది. అందుకోసం ప్రభుత్వ టెలికాం ఆపరేటర్ రూ.666 రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఇది 110 రోజులు చెల్లుబాటు అవుతుంది. రోజుకి 2GB డేటా ఇతర ప్రయోజనాలను అందిస్తోంది.

BSNL రూ. 666 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్

BSNL రూ. 666 ప్లాన్ 110 రోజుల వాలిడిటీతో వస్తుంది. రోజుకి 2GB డేటాను కూడా అందిస్తుంది.110 రోజులు చెల్లుబాటుతో, వినియోగదారులు మొత్తం 220 GB డేటాను పొందుతారు. దీనితో పాటు, ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత కాలింగ్ సౌకర్యం, రోజువారీ ఉచిత 100 SMS లను అందిస్తోంది. అదనంగా రింగ్ బ్యాక్ టోన్ సేవ (PRBT), జింగ్ మ్యూజిక్ మెంబర్‌షిప్, హార్డీ గేమ్ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా ఉచితంగా అందిస్తుంది.

Advertisement

Next Story