ఐదుగురు దొంగల అరెస్ట్.. అసలు కారణం అదే..

by Javid Pasha |
ఐదుగురు దొంగల అరెస్ట్.. అసలు కారణం అదే..
X

దిశ, ఝరాసంగం: గత కొంతకాలంగా జల్సాలకు అలవాటుపడి వ్యవసాయ బావులు, బోరు బావుల వద్ద ఎలక్ట్రిక్ బోర్వెల్ కేబుల్ వైర్‌కట్ చేసి జల్సాలు చేస్తున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు ఝరాసంగం ఎస్ఐ రాజేందర్ రెడ్డి పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఝరాసంగం మండల పరిధిలోని ఎల్గోయి గ్రామానికి చెందిన బి.సతీష్, ఎండి. ఉస్మాన్, చాకలి, రాజు, చాకలి, సిద్దన్న, ఖురేషి, శంభు సోలాపురం, శ్రీనివాసులు కలిసి చెడు అలవాట్లకు అలవాటుపడి ఝరాసంగం, న్యాల్‌కాల్, జహీరాబాద్, రాయికోడ్ , పరిధిలోగల గ్రామ శివారులో వ్యవసాయ బావులు, బోర్ బావుల వద్ద ఎలక్ట్రిక్ బోర్వెల్ కేబుల్ వైర్ కట్ చేసి దొంగిలించి అమ్ముకునేవారు. ఈ దొంగతనానికి సంబంధించి నమ్మదగిన సమాచారం రావడంతో రైడ్ చేశారు. వారిలో ఒకరు తప్పించుకుని పారి పోగా మిగిలిన ఐదుగురిని వెంబడించి పట్టుకున్నారు. వారిని గ్రామంలో అరెస్టు చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందన్నారు.

Advertisement

Next Story