అర్జున్ రెడ్డితో డేటింగ్ చేస్తానంటున్న బాలీవుడ్ నటి

by S Gopi |   ( Updated:2022-07-13 17:37:13.0  )
అర్జున్ రెడ్డితో డేటింగ్ చేస్తానంటున్న బాలీవుడ్ నటి
X

దిశ,వెబ్‌డెస్క్: విజయ్ దేవరకొండకి అర్జున్ రెడ్డి సినిమాతో ఫ్యాన్ ఇండియా లెవెల్‌లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ప్రస్తుతం విజయ్ లైగర్ మూవీలో నటిస్తున్నాడు. పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో మార్షల్ ఆర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతోందీ చిత్రం. అయితే ఇటీవల లైగర్ నుంచి రౌడీ హీరో న్యూడ్ పోస్టర్‌ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టర్ సినీ ఇండస్ట్రీని షేక్ చేసింది. కాగా, కాఫీ విత్ కరన్ షోలో పాల్గొన్న బాలీవుడ్ ముద్దుగుమ్మలు జాన్వీ కపూర్, సారా అలీఖాన్‌లను మీకు ఎవరితో డేటింగ్ చేయాలని ఉందని కరణ్ అడగ్గా.. సారా అలీఖాన్ విజయ్ దేవరకొండ పేరు చెప్పేసింది. డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్‌లో ప్రోమోను విడుదల చేశారు. సారా అలీఖాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ కామెంట్స్ పై విజయ్ దేవరకొండ స్పందిస్తూ హార్ట్ సింబల్ యాడ్ రౌడీ హీరో సెండింగ్ బిగ్ హాగ్స్ అండ్ మై ఎఫెక్షన్ అంటూ ప్రోమోనుకు రిప్లై ఇచ్చాడు.

Advertisement

Next Story

Most Viewed