ప్రజల దీవెనలే.. ప్రభుత్వానికి ఆశీస్సులు: మంత్రి నిరంజన్ రెడ్డి

by Mahesh |
ప్రజల దీవెనలే.. ప్రభుత్వానికి ఆశీస్సులు: మంత్రి నిరంజన్ రెడ్డి
X

దిశ, వనపర్తి : ప్రజల దీవెనలే ప్రభుత్వానికి ఆశీస్సులు అని దృఢంగా నమ్మే సీఎం కేసీఆర్. గడపగడపకు సంక్షేమ ఫలాలు అందే విధంగా చర్యలు తీసుకుంటున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. బుధవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో 111 మందికి సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరైన రూ.30 లక్షల 63 వేల విలువైన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల అందరితో కలిసి అల్పాహారం చేశారు. అనంతరం మంత్రి నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో ఉందని అన్నారు.

దివ్యాంగులు, వృద్ధులు, ఒంటరి మహిళల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఆసరా పించన్లలను అందజేయడంతో పాటు.. మెరుగైన వైద్య సేవల కోసం ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుందని వివరించారు. కరోనా విపత్తులోనూ పేదల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ పథకాలు అమలు చేశామని మంత్రి గుర్తు చేశారు. అనంతరం శ్రీ శుభ కృత నామ సంవత్సర పంచాంగాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story