వారిని సస్పెండ్ చేయడంతో.. సీఎం దిష్టిబొమ్మను దగ్దం చేసిన బీజేపీ నాయకులు

by Vinod kumar |   ( Updated:2022-03-07 15:43:29.0  )
వారిని సస్పెండ్ చేయడంతో.. సీఎం దిష్టిబొమ్మను దగ్దం చేసిన బీజేపీ నాయకులు
X

దిశ, అల్వాల్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్​ సమావేశాల నుంచి బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం కేసీఆర్​ప్రభుత్వం నియంత పోకడలకు నిదర్శనమని అల్వాల్​సర్కిల్​ బీజేపీ కార్యదర్శి తూప్రాన్​లక్ష్మణ్​ అన్నారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం ఓల్డ్ విగ్రహం వద్ద కేసీఆర్ ​దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలచే ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలను సభలో నుండి చట్టవిరుద్ధంగా సస్పెండ్​ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి, టీఆర్‌ఎస్​వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మడ కొండ శ్రీనివాస్​ రావు, రాసూరి అనిల్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story