- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభుత్వ ఆసుపత్రులపై రాములమ్మ ఫైర్.. కేసీఆర్ సర్కార్ అధ్వానమంటూ
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ప్రభుత్వాసుపత్రుల తీరుపై బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి ఫైరయ్యారు. కేసీఆర్ సర్కారులో ప్రభుత్వ ఆసుపత్రులు అధ్వానంగా ఉన్నాయంటూ శనివారం ట్విట్టర్ వేదికగా ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు మెరుగైన వైద్యం అందాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినవే ప్రభుత్వ దవాఖానలనీ, అయితే అవి కాస్త పేదలకు దూరమవుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ దవాఖానాలో ఉచితంగా అందాల్సిన వైద్య సేవలు పెయిడ్ సర్వీసులుగా మరిపోతున్నాయంటూ ధ్వజమెత్తారు. ప్రతి టెస్టుకు దారుణంగా డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. సీటీ స్కాన్‌కు రూ.500 నుంచి రూ.800, ఎంఆర్ఐకి రూ.2 వేలు, పెట్ స్కాన్‌కు రూ.5 వేలు చార్జ్ చేస్తూ పేదలకు వైద్యం అందకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో కేన్సర్ రోగులకు ట్రీట్‌మెంట్ అందించేందుకు ఉన్న ఏకైక సర్కార్ దవాఖాన ఎంఎన్‌జే అని, మూడేండ్ల నుంచి ఇక్కడ చార్జీలు వసూలు చేయడం మొదలు పెట్టారని ఆమె ఆరోపించారు. ఇదేంటని ప్రశ్నిస్తే ఆరోగ్యశ్రీ నుంచి డబ్బులు రాగానే పేషెంట్లకు రీఫండ్ చేస్తామంటూ చెప్పినా నేటికీ పైసా రీఫండ్చేయలేదన్నారు. తాజాగా కోఠీలోని ఈఎన్‌టీ హాస్పిటల్, ఎర్రగడ్డలోని చెస్ట్ హాస్పిటల్‌లోనూ పైసల వసూలు కార్యక్రమం మొదలుపెట్టారని ఆరోపించారు. డబ్బులెందుకని అడిగితే కడితేనే వైద్యం.. లేకుంటే లేదని మోహం మీదనే చెబుతున్నారంటూ పేర్కొన్నారు.
డబ్బులు కట్టినట్టు రశీదు అడిగితే ఆస్పత్రి డెవలప్‌మెంట్ కింద డొనేషన్ ఇచ్చినట్టు ఒక స్లిప్ ఇస్తున్నారని, ఇదేంటని అడిగితే.. రోగుల్ని దబాయించి పంపిస్తున్నారని రాములమ్మ తెలిపారు. అయితే రాష్ట్ర సర్కార్ ఆదేశాల మేరకే చార్జీలు వసులు చేస్తున్నామని హెల్త్ ఆఫీసర్లు చెబుతున్నారని ఆమె పేర్కొన్నారు. అయాని కేసీఆర్ ప్రభుత్వం నుంచి ఉలుకు పలుకులేదని, ఈ దొరల సర్కార్‌కు పేద ప్రజలే కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయమని విజయశాంతి ధీమా వ్యక్తం చేశారు.