- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కుర్తా వేసుకున్న హెడ్‌మాస్టర్‌కు డీఎమ్ చివాట్లు.. ద్యేవుడా..! (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్ః బీహార్‌లోని ఓ జిల్లా మేజిస్ట్రేట్ (DM) ఓవర్ యాక్షన్ చేశారంటూ ఇంటర్నెట్‌లో తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. కుర్తా-పైజామా ధరించారని పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని ఇష్టం వచ్చినట్లు తిట్టిన DM వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ సంఘటన జూలై 6న బాల్‌గూడర్‌లోని బాలికల ప్రాథమిక పాఠశాలలో చోటుచేసుకుంది. ఆరోజు లఖిసరాయ్ జిల్లాకు చెందిన DM సంజయ్ కుమార్ సింగ్ ఆకస్మిక తనిఖీకి పాఠశాలకు వెళ్లగా, పాఠశాల ప్రధానోపాధ్యాయుడైన నిర్భయ్ కుమార్ సింగ్‌కుర్తా పైజామా ధరించి ఉన్నారు. దీనిపై కోపగించుకున్న DM టీచర్‌గా కాకుండా రాజకీయ నాయకుడిలా కనిపిస్తున్నావని అన్నారు. అంతే కాక, కుర్తా-పైజామా ధరించినందుకు హెడ్‌మాస్టారుకు షో-కాజ్ నోటీసును జారీ చేసి, జీతంలో కోత విధించారు.
"నువ్వు టీచర్ లా కనిపిస్తున్నావా? ఎవరో స్థానిక ప్రజాప్రతినిధివి అని అనుకున్నాను'' అని డీఎం సంజయ్‌కుమార్ సింగ్ చెప్పడం వీడియోలో వినిపించింది. దానికి ఆ ప్రధానోపాధ్యాయుడు వివరణ ఇవ్వడానికి ప్రయత్నిస్తుండగా, DM ఆయనకు అవకాశం ఇవ్వరు. "మీరు ఉపాధ్యాయులైతే, టీచర్‌లా ఉండండి. ఈ వేషంలో నిన్ను గురువుగా అంగీకరించలేము. ప్రజాప్రతినిధిలా ప్రవర్తిస్తే వెళ్లి ఓట్లు అడగండి. మేము దీన్ని అనుమతించలేము", అని DM నిర్భయ్‌కి చెప్పడం వీడియోలో కనిపిస్తుంది. ఇక, దీనిపై మెజారిటీ నెటిజనులు DM వైఖరిని విమర్శించారు. ఉపాధ్యాయుడిని పిల్లల ముందే అలా తక్కువ చేసినందుకు నిందించారు. సాంప్రదాయ దుస్తుల్లో పాఠశాలకు రావడం ఏ విధంగా తప్పంటూ ప్రశ్నించారు. కుర్తా-పైజామా ధరించకుండా నియమాలు ఉండటం సరికాదని సూచించారు.
Does wearing "Kurta Pyjama" by a teacher is now crime in India??
— Saurabh Pathak (@SaurabhPathakJi) July 10, 2022
This DM is ordering 'show cause' and 'salary cut' notice just for wearing "Kurta Pyjama".
The way this English Babu DM is behaving, is it anyhow acceptable @jsaideepak and @JaipurDialogues sir?? pic.twitter.com/wr8MUsrSFV