- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సెక్స్‌కు ముందు, తర్వాత.. ఆ ఒక్క పనితో ఊహించని ఉద్వేగం
దిశ, ఫీచర్స్ : దుప్పట్లో భాగస్వామితో గడిపే ఏకాంత సమయాన్ని ఎవరు మాత్రం ఆస్వాదించరు? కానీ ఇదంతా శృంగార చర్యకే పరిమితమా? ఆ తర్వాత ఇలాంటి అనుభవం పొందలేరా? అంటే.. బెడ్‌రూమ్ లోపలే కాదు వెలుపల కూడా హెల్తీ రిలేషన్‌షిప్‌కు కమ్యూనికేషన్‌ను అసలైన సీక్రెట్‌గా చెబుతుంటారు నిపుణులు. ఈ భావనను మరింత లోతుగా అర్థం చేసుకోవాలంటే కామసూత్ర ఎక్స్‌పర్ట్, ప్లెజర్ ఫోకస్డ్ సెక్స్ ఎడ్యుకేటర్ సీమా ఆనంద్ మాటలు వినాల్సిందే.
బెడ్ రూమ్‌లో పార్ట్‌నర్స్ మధ్య సంభాషణలు ఎలా ఉద్రేకపరుస్తాయో సీమా ఆనంద్ వివరించారు. కామసూత్రలోని రెండవ సెక్షన్ ప్రాధాన్యతను వెల్లడించిన ఆమె.. సెక్స్‌కు ముందు సంభాషణలు కొంటెగా ఉండాలని, ఇరువురి మధ్య ఇంటిమసీకి అడ్డుగా ఉన్న ప్రతిబంధకాలను అవి తగ్గిస్తాయని తెలిపారు. ఇక పరిశోధన ప్రకారం.. బలమైన లైంగిక సంభాషణ కలిగిన జంటలు సెక్సువల్ లైఫ్‌లో మరింత సంతృప్తి పొందుతారు. సెక్స్ అంశాలపై ఓపెన్ టాక్ అనేది ఇద్దరి మధ్య సాన్నిహిత్యంతో పాటు బలమైన సంబంధానికి పునాదిగా ఉంటుంది. దీనివల్ల ఒకవేళ సెక్స్‌లో కలిగే అసంతృప్తి లేదా కొత్తగా ప్రయత్నించాలనే కోరిక గురించి పార్ట్‌నర్‌తో ఎలాంంటి బెరుకు లేకుండా మాట్లాడవచ్చు.
సెక్స్ గురించి సంభాషణలు
సెక్స్ అనేది వ్యక్తుల బలహీనత సహా చాలా భావోద్వేగాలను బయటకు తీసుకొచ్చే చర్య. అయితే శృంగారం తర్వాత శరీరాన్ని తిరిగి నియంత్రిత స్థితికి తీసుకురావడం చాలా ముఖ్యం. అందుకే sexual aftercare(సెక్స్ తర్వాత పార్ట్‌నర్ సంరక్షణ) పద్ధతిని అనుసరించాలి. ఇది కౌగిలించుకోవడం, మసాజ్ చేయడం, ముద్దు పెట్టుకోవడం, చేతులు పట్టుకోవడం లేదా సంతోషకరమైన, ప్రశాంతమైన సంభాషణలకు సంబంధించినది. సాధారణంగా సెక్స్ తర్వాత పార్ట్‌నర్ పర్ఫార్మెన్స్ పట్ల అసంతృప్తి ఉంటే విమర్శించకూడదు. ప్రత్యేకంగా వారి శరీరాలపై వ్యాఖ్యానించకూడదు. ఇద్దరి మధ్య వివాదానికి కారణమయ్యే విషయాలు ప్రస్తావించకుండదు.
అన్నింటికంటే ముఖ్యంగా.. మాజీ పార్ట్‌నర్‌తో లైంగిక అనుభవాలను అస్సలు పోల్చవద్దు. సంభాషణలు, చర్యలు అవసరమే కానీ సెక్స్ తర్వాత వెంటనే ఇలాంటి టాపిక్ ప్రమాదం. అదేవిధంగా సీరియస్ సబ్జెక్ట్స్ డిస్కస్ చేయకపోవడం లేదా మీకు నచ్చే విధంగా చేయమని భాగస్వామిని ఒప్పించకపోవడం ఉత్తమం. ఎందుకంటే అతను/ఆమె అంతకుముందు ఏదైనా విషయంలో సౌకర్యంగా లేకుంటే.. ఇది మానిప్యులేటివ్‌గా కనిపించే అవకాశం ఉంది.