- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బీఈడీ విద్యార్థులు టెట్ కోసం ఎదురుచూపులు
దిశ, మహేశ్వరం: టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) కోసం బీఈడీ విద్యార్థులు 5 సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి ఆరు నెలలకొకసారి టెట్ ను నిర్వహించాలి. 2017 సంవత్సరం నుంచి ప్రభుత్వం నేటికీ ఒక్కసారి కూడా టెట్ ను నోటిఫికేషన్ విడుదల చేయకపోవడంతో బీఈడీ పూర్తి చేసిన విద్యార్థులు అయోమయ స్థితిలో ఉన్నారు. గత సంవత్సర క్రితమే ప్రభుత్వం మూడు నెలల లోపే టెట్ నోటిఫికేషన్ వస్తుందని ప్రకటించిన నేటికీ అమలుకు నోచుకోలేదంటున్నారు.
రాష్ట్రంలో బీఈడీ పూర్తి చేసిన విద్యార్థులు సుమారు 8 లక్షల మందికి పైగా విద్యార్థులు టెట్ నోటిఫికేషన్ కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. దీంతో పాటు గతంలో టెట్ పాసై ఏడు సంవత్సరాలు పూర్తి చేసిన విద్యార్థులు కూడా టెట్ కోసం ఎదురుచూస్తున్నారు. సీఎం కేసీఆర్ ఇటీవల అసెంబ్లీలో స్కూల్ ఎడ్యుకేషన్ లో 23,798 ఉద్యోగాల ఖాళీగా ప్రకటన చేయడంతో, ఇన్ని రోజులు ఖాళీగా ఉన్న విద్యార్థులు టెట్ కోసం వేచి చూస్తున్నారు. మరో ప్రక్క సీఎం కేసీఆర్ టెట్ నోటిఫికేషన్ విడుదల చేయకుండానే ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గురించి మాట్లాడడం వల్ల బీఈడీ పూర్తి చేసిన విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
టెట్ పైన స్పష్టత ఇవ్వాలి.. శివ కుమార్ (బీఈడీ విద్యార్థి)
రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం అన్నోజిగూడ గ్రామానికి చెందిన శివకుమార్ 2019లో బీఈడీ పూర్తి చేశాను. ప్రభుత్వం 2017 నుంచి టెట్ నోటిఫికేషన్ విడుదల చేయలేదు. టెట్ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాతనే ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయాలి. లేకపోతే చాలా మంది విద్యార్థులు నష్టపోతారు. చాలా రోజుల నుంచి టెట్ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నాను. గత సంవత్సరం క్రితమే టెట్ నోటిఫికేషన్ విడుదల చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించడంతో హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్ లో ఓ ప్రైవేట్ ఇనిస్టిట్యూట్లో కోచింగ్ తీసుకుంటున్న సమయంలోనే ప్రభుత్వం లాక్ డౌన్ పెట్టడంతో ఇంటికి వచ్చా.. ఇప్పటికైన టెట్ నోటిఫికేషన్ ప్రభుత్వం ఫస్ట్ టెట్ నోటిఫికేషన్ పైన స్పష్టత ఇవ్వాలి.
టెట్, డీఎస్సీ ఒకేసారి నోటిఫికేషన్ వేస్తే.. ఆందోళనకు గురవుతారు.. ప్రియాంక (బీఈడీ విద్యార్థి)
నగరంలోని సంతోష్ నగర్ కు చెందిన ప్రియాంక బీఈడీ పూర్తి చేసి 5 సంవత్సరాలు అవుతుంది. 2017 నుంచి టెట్ నోటిఫికేషన్ ఊసే లేదు. ప్రభుత్వం మొదటగా టెట్ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాతనే ఉపాధ్యాయ పోస్టుల నోటిఫికేషన్ విడుదల చేయాలి. గత ఐదు సంవత్సరాల నుంచి టెట్ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నాను. టెట్, ఉపాధ్యాయ నోటిఫికేషన్ ఒకే సారి నోటిఫికేషన్ వేస్తే ఆందోళనకు గురవుతాము. టెట్ కు ఉపాధ్యాయ నోటిఫికేషన్ 6 నెలల కాల వ్యవధి ఉండేలా.. ప్రభుత్వం చూడాలి.