- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
చెడు అలవాట్లు.. మంచివే! నష్టాల కంటే లాభాలే ఎక్కువ : నిపుణులు
దిశ, ఫీచర్స్ : ఆరోగ్యకర జీవనం కోసం అద్భుతాలు చేయాల్సిన అవసరం లేదు. కేవలం మంచి అలవాట్లను అలవరచుకుంటే చాలు. కానీ ప్రస్తుత ప్రపంచంలో ఒకరకంగా ఇది అసాధ్యమే. ఈ రోజుల్లో ఏదో ఒక చెడు అలవాటు లేని మనిషి ఉండటంటే అతిశయోక్తి కాదు. గోర్లు కొరకడం, బూతులు మాట్లాడటం, గాసిప్స్ క్రియేట్ చేయడం, ఆలస్యంగా మేల్కోవడం, షవర్ కింద స్నానం చేస్తూ యూరిన్ పాస్ చేయడం.. ఇలా ఒక్కొక్కరికి ఒక్కో రకమైన బ్యాడ్ హ్యాబిట్ ఉండే ఉంటుంది. ఇవి ఆయా వ్యక్తులకు కలిగించే నష్టం గురించి పక్కనబెడితే, పక్కనున్న వారికి మాత్రం చిరాకు పుట్టిస్తాయి. ఇక 'పుర్రెల పుట్టిన గుణం పుల్లల్లేసిన పోదు!' అన్నట్లు.. ఎంతమంది వారించినా, ఎంత ప్రయత్నించినా వారు ఈ అలవాట్లను వదిలించుకోలేరు. అయితే ఈ భయంకరమైన లోపాల్లో కొన్ని చెడు కంటే ఎక్కువ మేలు చేస్తాయని నిపుణులు చెప్తున్నారు. ఇంతకీ ఆ అలవాట్లు ఏవో చూద్దాం!
అయోమయం : గజిబిజిగా, గందరగోళంగా కనిపించే వ్యక్తులను ఎవరూ పెద్దగా ఇష్టపడరు. కానీ ఆ లక్షణాలే వారిని అత్యంత తెలివైనవారిగా సూచిస్తాయి. అంతేకాదు మీ చిన్నారి ఇంటి చుట్టూ చిందరవందరగా వస్తువులను వదిలేస్తే తను మేధావి అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే కొద్దిగా అపరిశుభ్రంగా ఉండటమే మేధస్సుకు చిహ్నంగా కనిపిస్తుందని మిన్నెసోటా విశ్వవిద్యాలయ అధ్యయనం స్పష్టం చేసింది. ఇక అయోమయం విషయానికొస్తే.. కొంచెం అస్తవ్యస్తంగా ఉండటం అనేది సృజనాత్మకత పెంపొందించేందుకు దారితీస్తుందని కూడా పేర్కొంది.
ఎప్పుడూ ఆలస్యమే : కొందరు వ్యక్తుల్లో ప్రతిసారి నిర్దేశిత సమయం కన్నా కొంచెం ఆలస్యంగా రావడం ఓ అలవాటుగా ఉంటుంది. దీంతో స్కూల్ పిల్లలైతే టీచర్‌తో, ఆఫీస్ ఎంప్లాయ్స్ అయితే బాస్‌తో చివాట్లు తినడం కామన్. ఈ విషయంలో కొలీగ్స్ కూడా విసుగు చెందుతుంటారు. అయితే, సమయపాలనలో ఈజీ గోయింగ్ అప్రోచ్ కలిగిన వ్యక్తులు తక్కువగా ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉందని హార్వర్డ్ మెడికల్ స్కూల్ నిర్వహించిన ఒక అధ్యయనం వెల్లడించింది. అంటే ఆలస్యంతో మీరు మరింత ఉల్లాసవంతమైన వ్యక్తి కావచ్చు.
నిద్రపోతుండటం : ఎక్కువ సమయం పడుకుంటే అంత ఎక్కువ కాలం జీవిస్తామనేది మేల్కొనేందుకు బద్దకించే వారు చెప్పే మాట. అలారం స్నూజ్ బటన్‌ను అదే పనిగా నొక్కడంలో వీరు సిద్ధహస్తులు. ఇది చెడు అలవాటే అయినప్పటికీ వ్యక్తిగత ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే ఎక్కువసేపు నిద్రపోవడం వల్ల ఒత్తిడి తగ్గి, జ్ఞాపకశక్తి మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. సరిపడా నిద్ర పొందలేకపోతే కారు ప్రమాదాలు, గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది.
జుట్టుతో ఆటలాడటం : చాలామంది ఏమీ తోచనప్పుడు జుట్టును మెలితిప్పుతూ ఉంటారు. ఫోన్ చూస్తూనో లేదా బుక్‌లో పర్టిక్యులర్ టాపిక్‌తో కుస్తీపడుతున్నపుడో ఇలా చేస్తుంటారు. అయితే ఏదైనా విషయంపై కాన్సంట్రేట్ చేయలేకపోతే జుట్టుతో ఆడుకోవడం అనేది హెల్ప్‌ఫుల్‌గా ఉంటుందని, బోర్‌డమ్‌తో పోరాడుతుందని 2014లో ఒక అధ్యయనం వెల్లడించింది. ఇది ఆందోళనను తగ్గించడంలో కూడా సాయపడుతుంది.
స్నానంలో మూత్ర విసర్జన: నిజానికి దీన్ని అత్యంత చెడ్డ అలవాటుగా పేర్కొంటాం. కానీ ఇందులోనూ కొన్ని అనుకూలతలు ఉన్నాయి. విషయానికొస్తే.. మూత్రంలో యూరిక్ యాసిడ్, అమ్మోనియా రెండూ ఉంటాయి. దీనివల్ల స్నానం చేస్తున్నపుడు మూత్ర విసర్జన చేస్తే పాదాలకు ఫంగల్ ఇన్ఫెక్షన్ సోకే అవకాశం తగ్గుతుంది. కానీ శరీరంపై గాయాలుంటే మాత్రం ఈ ప్రాక్టీస్ చేయకూడదు. ఎందుకంటే ఇది బాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్‌కు దారితీయొచ్చు.
మెలికలు తిరగడం : చుట్టుపక్కల వ్యక్తులను పరిశీలిస్తే.. కొంతమంది అస్సలుగా కుదురుగా ఉండరు. పనిచేస్తున్నపుడే కాక మాట్లాడుతున్నప్పుడు కూడా మెలికలు తిరుగుతూ చూసేవారికి వింతగా కనిపిస్తారు. కానీ ఇది కేలరస్ బర్న్ చేయడంలో సాయపడుతుందని లండన్‌లోని మాయో క్లినిక్ పరిశోధనలో తేలింది.
గాలి కబుర్లు : ప్రత్యేకించి ఒత్తిడిని తగ్గించడంలో మంచి గాసిప్ కంటే మించిన ప్రత్యామ్నాయం ఏదీ లేదని చెప్పొచ్చు. కొలీగ్స్‌తో హెల్తీ చాట్ చేయడం వారితో బంధం బలపడేందుకు, హాయిగా నవ్వుకునేందుకు తోడ్పడుతుంది. ఎందుకంటే ఇది ఫీల్ గుడ్ హార్మోన్స్ విడుదలకు హెల్ప్ చేస్తుంది. అంటే సదరు గాసిప్స్ టాపిక్ మీరు కాదు కాబట్టి ఒత్తిడి, ఆందోళన రెండింటినీ తగ్గిస్తుంది.
ప్రమాణ స్వీకారం: మనలో ఎవరైనా గానీ కొన్నిసార్లు F**ck వర్డ్ యూజ్ చేస్తుంటాం. ఒక్కోసారి ఇది ఎదుటి వ్యక్తిని గాయపరచవచ్చు. కానీ కీలే విశ్వవిద్యాలయ అధ్యయనం ప్రకారం.. ఇలాంటి ఒక బూతు పదాన్ని పలికినపుడు సదరు వ్యక్తి అంతర్గతంగా బాధిస్తున్న నొప్పిని ఎక్కువసేపు తట్టుకోగలడని స్పష్టం చేసింది. ఇది సంబంధిత సామర్థ్యాన్ని 33% పెంచడంలో సాయపడింది.