- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
గోవా ఎయిర్‌పోర్టులో నటిపై లైంగిక వేధింపులు.. న్యాయం కావాలంటున్న భర్త
దిశ, సినిమా : ఇటీవల గోవా ఎయిర్‌పోర్ట్‌లో తన ఫ్యామిలీ లైంగిక వేధింపులకు గురైనట్లు బాలీవుడ్ నటి అయేషా టాకియా భర్త ఫర్హాన్ అజ్మీ తెలిపాడు. సొంత దేశంలోనే ఇలా జరగడం అవమానంగా ఉందని పేర్కొన్నాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్న ఆయన.. 'డియర్ ఫ్రెండ్స్, నేను నా ఫ్యామిలీతో 'ఇండిగో 6E 6386' విమానంలో గోవా నుంచి ముంబైకి ప్రయాణించేదుకు సిద్ధమయ్యాను. ఇదే సమయంలో ఆర్‌పీసింగ్, ఏకే యాదవ్ అనే సీనియర్ ఆఫీసర్లు నా పేరును బిగ్గరగా ప్రస్తావించారు. వెంటనే సెక్యూరిటీ డెస్క్‌లోని ఓ పురుష అధికారి.. నా ఫ్యామిలీని మరొక లైన్‌లో నిలబడమని సూచిస్తూ అయేషా ఒంటిని తాకుతూ అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో అతని దగ్గరికెళ్లి ఏ మహిళనైనా అలా తాకొద్దని, దూరం పాటించమని కోరాను' అంటూ ట్వీట్‌లో వివరించాడు.
అయితే ఈ గొడవ తర్వాత మళ్లీ తనను తనిఖీ చేస్తున్నప్పుడు కూడా డర్టీగా సెక్సువల్ కామెంట్స్ చేశారని చెప్పాడు. ఈ ట్వీట్ వైరల్ కావడంతో స్పందించిన ఎయిర్‌పోర్ట్ అధికారులు.. 'ప్రయాణంలో మీకు, మీ కుటుంబ సభ్యులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. ఈ విషయాన్ని విచారించి తగిన చర్యలు తీసుకుంటాం' అని హామీ ఇచ్చారు.
Dear @CISFHQrs
— Farhan Azmi (@abufarhanazmi) April 4, 2022
I was boarding for Mumbai on @IndiGo6E 6386, 18:40 hrs flight & these racist officers R P Singh, A K Yadav, commander Rout & senior officer (SP category) Bahadur purposely singled me & my family (wife & son) immediately after they read out my name out loud to team pic.twitter.com/gjHdnFajDN