ఎన్టీఆర్‌ కుటుంబానికి ఆగస్టు నెల గండం ఉందా..?

by sudharani |
ఎన్టీఆర్‌ కుటుంబానికి ఆగస్టు నెల గండం ఉందా..?
X

దిశ, వెబ్‌డెస్క్: ఆగస్టు నెల ఎన్టీఆర్ కుటుంబానికి గండంగా మారింది. ఈ నెల వచ్చిందంటే ఆ కుటుంబంలో ఏదో కీడు జరగబోతుంది అనేలా పరిస్థితి మారిపోయింది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావును పదవి నుంచి దింపేసింది కూడా ఇదే నెల. ఆయన కొడుకును, కుమార్తెను పొగొట్టుకుంది కూడా ఇదే నెల కావడం అందరికీ తెలిసిందే.

ఎన్టీఆర్ కుమారుడు నందమూరి హరికృష్ణ 2019 ఆగస్టు 29న నల్లగొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. తాజాగా ఎన్టీఆర్ నాలుగో కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి కూడా ఆగస్ట్ 1న ఆత్మహత్యకు పాల్పడింది.

ఇక టీడీపీకి కూడా ఈ ఆగస్టు నెల అచ్చిరాలేదని చెప్పాలి. 1994 ఆగస్టులో ఎన్టీఆర్ హార్ట్ సర్జరీ కోసం అమెరికాకు వెళ్లగా.. అదే సమయంలో ఎన్టీఆర్ కేబినెట్‌లో మంత్రిగా ఉన్న నాదెండ్ల భాస్కర్ రావు ఎన్టీఆర్‌పై తిరుగుబాటు చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దీంతో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి పదవినే కోల్పోయారు. ఆ తర్వాత తిరిగి పదవి చేపట్టినా 1995 ఆగస్టులో చంద్రబాబు రూపంలో ఎన్టీఆర్‌కు మరో దెబ్బ తగిలింది. చంద్రబాబు అధికారంలోకి వచ్చి.. తెలుగుదేశం పార్టీకి తానే అధిపతినని దాన్ని తన చేతుల్లోకి తీసుకున్నారు. ఇలా ముఖ్యమంత్రి పదవిని, పార్టీని ఎన్టీఆర్‌కు కాకుండా చేశారు. కాగా.. తాజాగా ఎన్టీఆర్ చిన్నకుమార్తె ఉమామహేశ్వరి ఆగస్టులోనే ఆత్మహత్యకు పాల్పడి తమ కుటుంబానికి ఆగస్టు నెల అచ్చిరాదనే విషయాన్ని నిరూపించేలా చేసి.. ఆ కుటుంబంలో విషాదాన్ని మిగిల్చిందనే చెప్పాలి.

Advertisement

Next Story

Most Viewed