అలా చేస్తున్నారని దంపతులపై దాడి!

by Web Desk |
అలా చేస్తున్నారని దంపతులపై దాడి!
X

దిశ, ఆందోల్: బాణామతి చేస్తున్నారన్న నెపంతో దంపతులిద్దరిని విద్యుత్ స్తంభానికి కట్టేసి చితకబాదిన సంఘటన మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం కేంద్రంలో చోటు చేసుకుంది. అల్లాదుర్గం కు చెందిన బోయిని రమేష్, రజిత దంపతులపై అదే గ్రామానికి చెందిన వారి సమీప బంధువులైన‌ కుమార్, నాగేష్, బేతయ్య, ఆశమ్మ, అంబమ్మ లు సోమవారం ఉదయం దాడి చేశారు.

పోలీసుల‌కు స‌మాచారం అంద‌డంతో ఘ‌ట‌న స్థలానికి వెళ్లి ఈ దాడిలో ర‌మేష్‌, ర‌జీత‌ల‌ను విడిపించారు. బంధువుల దాడిలో వారికి తీవ్ర గాయాలు కావ‌డంతో అసుప‌త్రికి తీసుకెళ్లి, చికిత్స చేయించారు. దాడికి పాల్పడిన వారి కుటుంబ స‌భ్యులు త‌రుచూ ఆనారోగ్యానికి గురి కావ‌డంతో ర‌మేష్‌, రజిత‌లు మంత్రాలు చేసి, బాణామ‌తి చేయిస్తున్నార‌ని భావించారు. దీంతో వారిపై దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.

సాంకేతిక ప‌రిజ్ఙానంతో స‌మాజం రోజు రోజుకు ముందుకు దూసుకువేళ్తుంటే, గ్రామాల్లో ఇంకా మూఢ న‌మ్మకాలను ప్రజలు మ‌రిచిపోవ‌డం లేద‌న‌డానికి ఈ ఘ‌ట‌నే నిద‌ర్శనం. గాయ‌ప‌డిన ర‌జిత ఫిర్యాదు మేర‌కు ఐదు మందిపై కేసు న‌మోదు చేసి, రిమాండ్‌కు త‌ర‌లించిన‌ట్లు అల్లాదుర్గం ఎస్ఐ మోహ‌న్ రెడ్డి తెలిపారు. ప్రజలు మూఢ న‌మ్మకాలను వీడాల‌ని, మంత్రాలు, బాణామ‌తి లాంటి వాటిని అస‌లు న‌మ్మకూడదని, క‌లిసి మెలిసి ఉండాల‌ని ఎస్ఐ మోహన్ రెడ్డి సూచించారు.

Advertisement

Next Story