జనశక్తి కేంద్ర కమిటీ సభ్యుల అరెస్ట్.. వారి వద్ద ఏమున్నాయంటే..?

by Vinod kumar |   ( Updated:2022-04-08 13:10:56.0  )
జనశక్తి కేంద్ర కమిటీ సభ్యుల అరెస్ట్.. వారి వద్ద ఏమున్నాయంటే..?
X

దిశ, కోరుట్ల: జనశక్తి కేంద్ర కమిటీలో చురుకుగా పని చేస్తున్న ముగ్గురు సభ్యులను శుక్రవారం తెల్లవారు జామున కోరుట్ల పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు కోరుట్ల పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం సాయంత్రం జగిత్యాల జిల్లా ఎస్పీ సింధూశర్మ వివరాలను వెల్లడించారు. జనశక్తి నేత కూర రాజన్న నాయకత్వంలో పని చేస్తున్న జనశక్తి సభ్యులైన వెల్గటూర్ మండలం కుమ్మరిపల్లి గ్రామానికి చెందిన పోహునుక సురేందర్ అలియాస్ వంజర సురేందర్, అలియాస్ సురేశ్ విశ్వనాథ్ అలియాస్ పీఎస్ పీ రెడ్డి, జగిత్యాల విద్యాపురికి చెందిన చెట్టి రాజేవార్, సిరిసిల్ల జిల్లా తంగేళ్లపల్లి మండలం రామన్న పల్లికి చెందిన నగునూరి రవీందర్‌లను కోరుట్ల పట్టణ శివారులో వాహన తనిఖీలో భాగంగా అనుమానాస్పదంగా ఉండడంతో వీరిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 2 పిస్తోల్లు, 2 రివాల్వర్స్, 3 తపంచాలు, 299 తూటాలు స్వాధీనం చేసుకున్నారు.


కాగా 1997లో మేడిపల్లి మండలం గోవిందారం గ్రామంలో జనశక్తితో పరిచయం ఏర్పడి పార్టీలో పని చేస్తున్న కూర రాజన్న ఆదేశాల మేరకు సురేందర్‌ జనశక్తిలో ఆగిపోయిన గ్రూపులో ఉన్నారు. కాగా 2011లో రవీందర్ అజ్ఞాతంలోకి వెళ్లాడు. 2013లో వేములవాడ-సుద్దాల మధ్య జరిగిన కాల్పుల్లో హత్యకు గురైన సుద్దాలకు చెందిన ప్రభాకర్ రావు హత్య కేసులో సురేందర్ ప్రధాన నిందితుడు. అక్కడి నుంచి సురేందర్ హైదరాబాద్‌లోని సంధ్య నగర్, బండియా గూడలోకి పారిపోయి పీఎస్ పీ రెడ్డి అనే పేరుతో నకిలీ ఐడీ పేరుతో జీవితాన్ని ప్రారంభించాడు.

కాగా 5 నెలల క్రితం అతను ఒక కంట్రీ మేడ్ పిస్టల్‌ను ట్వా మ్యాగజైన్‌లతో 17 లైవ్ రౌండ్‌లను, నగునూరి రవీందర్‌కు, 12 బోర్ సింగిల్ బ్యారెల్ గన్‌లను, మందు గుండు సామాగ్రిలను గున్నాల లక్ష్మయ్యకు అందించాడు. రెండు నెలల క్రితం మళ్లీ చెట్టి రాజేశ్వర్ ద్వారా కూర రాజన్నను కలిశాడు. కూర రాజన్న మళ్లీ అతనికి 6 చిన్న ఆయుధాలు, వివిధ ఆయుధాలకు సంబంధించిన భారీ మొత్తంలో మందుగుండు సామాగ్రిని అందజేసి, ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలోని ప్రాంతాల్లోని పాత ప్రాంతాలకు వెళ్లి స్థానిక యువకులను కలుసుకుని జనశక్తి గ్రూపు సాయుధ దళంలో చేరేలా వారిని ప్రేరేపించి వేతనాలు ఇప్పించాలని ఆదేశించాడు. స్థాపించబడిన రాజ్యానికి వ్యతిరేకంగా యుద్ధం, మర్డర్లు, కిడ్నాప్‌లు, దోపిడీలు వంటి ఘోరమైన నేరాలకు పాల్పడటం వంటి కార్యకలాపాలకు పాల్పడ్డారు.

గత మార్చి నెలలో గున్నాల లక్ష్మణ్‌తో కలిసి సిరిసిల్ల జిల్లా అక్కపల్లి-దర్మారం-పోతిరెడ్డిపల్లి అటవీ ప్రాంతంలో జనశక్తి గ్రూపు పెద్ద ఎత్తున ప్లీనరీ నిర్వహించి ప్రజలను భయాందోళనకు గురి చేశారని సిరిసిల్లతో పాటు పరిసర ప్రాంతాల్లో ప్రచారం చేశారు. ఆ తర్వాత 2022 మార్చి 23న గున్నాల లక్ష్మయ్య, నక్కా విజయ్, దర్శనాల కిషన్, బైనాల రవితో కలిసి వేములవాడ టౌన్‌ అయ్యోరిపల్లి కు చెందిన వంగల రాజ మల్లయ్యను హత మార్చాలని పథకం పన్నారు. కానీ పోలీసులు అక్కడకు వచ్చి గున్నాల లక్ష్మణ్‌ను పట్టుకోవడంతో అది సాధ్యపడలేదు.

ఆ తర్వాత రవీందర్ అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయినట్లు ఎస్పీ సింధూ శర్మ వివరించారు. పాత జనశక్తి కేడర్, లొంగిపోయిన క్యాడర్ ఎలాంటి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ సింధు శర్మ హెచ్చరిస్తున్నారు. ఈ సమావేశంలో మెట్ పల్లి డీఎస్పీ రవీందర్ రెడ్డి, కోరుట్ల సీఐ రాజ శేఖర్ రాజు, కోరుట్ల, కథలాపూర్, మేడిపల్లి ఎస్ఐలు సతీష్ , శ్యామ్ రాజ్, రజిత, సందీప్ రావు ఉన్నారు.

Advertisement

Next Story