షుగర్ పేషెంట్స్ ఈ కూరగాయ తింటున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి!!

by Anjali |   ( Updated:2024-10-16 11:04:03.0  )
షుగర్ పేషెంట్స్ ఈ కూరగాయ తింటున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి!!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత రోజుల్లో ఎంతో మంది డయాబెటిస్ బారిన పడుతున్నారు. దీంతో షుగర్ పెషేంట్లు ఏం తినాలన్నా సందేహపడాల్సి వస్తుంది. అయితే డయాబెటిస్ పేషెంట్లు దొండకాయ తినాలా వద్దా అని తాజాగా నిపుణులు చెబుతున్నారు. కొంతమంది దొండకాయ తింటే మతిమరుపు వస్తుందని అంటారు. దీంతో ఇందులో ఎలాంటి నిజం లేదని పోషకాహార నిపుణులు తేల్చి చెప్పారు. దొండకాయ తింటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. దొండకాయను కొన్ని ప్రదేశాల్లో టిండోరా అని కూడా పిలుస్తారు. దొండకాయ తింటే అలసట నుంచి ఉపశమనం పొందవచ్చు.

బలహీనతను తగ్గిస్తుంది. మహిళలకు గుండెను హెల్తీగా ఉంచడంలో మేలు చేస్తుంది. ఈ కూరగాయలో ఉండే రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. దొండకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దొండకాయ తింటే రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉంటాయి. శరీరంలో గ్లూకోజ్ టాలరెన్స్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. దొండకాయలో పీచు అధికంగా ఉంటుంది. దొండకాయలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల ఆహారం ఈజీగా జీర్ణమవుతుంది. దొండకాయ చిన్నగానే ఉంటాయి గానీ.. ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో. ఇందులో ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. దొండకాయలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed