AP EAPCET/AP EAMCET ఫలితాలు విడుదల

by Mahesh |   ( Updated:2022-07-26 10:30:20.0  )
AP EAPCET/ AP EAMCET 2022 Results Out
X

దిశ, ఏపీ బ్యూరో : AP EAPCET/ AP EAMCET 2022 Results Out| ఏపీ ఈఏపీ సెట్‌-2022 ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. విజయవాడలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ ఫలితాలను విడుదల చేశారు. అయితే ఏపీ ఈఏపీ సెట్‌ ఫలితాల్లో వ్యవసాయ విభాగంలో 95.03 శాతం మంది, ఇంజనీరింగ్‌ విభాగంలో 89.12 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో పాటు ప్రిన్సిపాల్ సెక్రటరీ శ్యామలరావు, ఉన్నత విద్య మండలి చైర్మన్ హేమచంద్ర రెడ్డి పాల్గొన్నారు.

ఈ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఇకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 4నుంచి 8వరకు పది సెషన్లలో జరిగిన ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌ ప్రవేశ పరీక్షలకు 2 లక్షల 6 వేల 579 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే లక్షల 94 వేల 752 మంది మంది మాత్రమే పరీక్ష రాశారు. అలాగే జూలై 11, 12 తేదీల్లో నాలుగు సెషన్లలో జరిగిన అగ్రికల్చర్‌, ఫార్మసీ సీట్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా 94 వేల 593 మంది దరఖాస్తు చేసుకోగా 87 వేల 744 మంది పరీక్షలకు హాజరయ్యారు. మొత్తంగా 3 లక్షల ఒక వెయ్యి 172 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. 2 లక్షల 82 వేల 496 మంది హాజరైన సంగతి తెలిసిందే.

ఇది కూడా చదవండి: ఎడాపెడా రుణాలు తీసుకుంటున్న ఏపీ సర్కార్!

Advertisement

Next Story