Anushka Shetty : స్వీటీ ఈజ్ బ్యాక్..! ఒకేసారి 2 సినిమాలతో రానున్న అనుష్క!

by Javid Pasha |   ( Updated:2024-10-23 16:01:49.0  )
Anushka Shetty : స్వీటీ ఈజ్ బ్యాక్..! ఒకేసారి 2 సినిమాలతో రానున్న అనుష్క!
X

దిశ, సినిమా : అనుష్క అంటేనే సినీ లవర్స్‌లో అదో క్రేజ్.. ఆమె నటనతోపాటు ఆహార్యానికి ఫిదా అయ్యే అభిమానగణం చాలా ఎక్కువ మందే ఉన్నారు. బాహుబలి తర్వాత వరుస ఫెయిల్యూర్స్‌తో ఇబ్బందిపడ్డ ఈ బ్యూటీ, ఆ తర్వాత భాగమతి, నిశ్శబ్దం, మిస్ శెట్టి మిస్టర్ఱ పొలిశెట్టి వంటి సినిమాలతో ఆడియన్స్ ముందుకు వచ్చినా అనుకున్నంత రేంజ్‌లో సక్సెస్ దక్కలేదు. అప్పటి నుంచి సాలిడ్ హిట్ కోసం వెయిట్ చేస్తున్న అనుష్క శెట్టి ఆ మధ్య మలయాళంలో కథనార్‌ మూవీతో పాటు క్రిష్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న బైలింగ్యువల్ సినిమా షూటింగ్‌లో బిజీ బిజీగా గడిపారు.

ఇటీవల కథనార్, బైలింగ్యువల్ మూవీ షూటింగ్స్ కూడా పూర్తవడంతో అన్ని భాషలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఒకేసారి రెండు సినిమాలతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు ‘స్వీటీ’ రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో ప్రమోషన్స్‌లో పాల్గొంటూ అభిమానులను కూడా పలకరించనుందట అనుష్క. ఇక చాలా కాలం గ్యాప్ తర్వాత ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో స్వీటీ లుక్స్ గురించి చర్చ జరుగుతోంది. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా టైమ్‌లో పర్‌ఫెక్ట్ ఫిజిక్స్‌తో కనిపించిన అనుష్క.. రాబోయే సినిమాల్లో అలాగే కనిపిస్తుందని అభిమానులు భావిస్తున్నారు. ఏదైతేనేం.. ఆమె సినిమా వస్తే చాలు అన్నట్లు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed