- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Telangana News: 'పదవులు ముఖ్యం కాదు'.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
దిశ, వైరా: అంబేద్కర్ ఆశయాల కోసం ప్రతి ఒక్కరూ అహర్నిశలు పనిచేయాలని మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వైరా మున్సిపాలిటీ పరిధిలోని గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహాలను బుధవారం ప్రారంభించారు. మొదటగా స్థానిక పాఠశాల ఎదురుగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. అనంతరం ద్విచక్ర వాహన ర్యాలీతో స్థానిక పాత బస్టాండ్ సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. సుమారు 250 మంది వృద్ద మహిళలకు చీరల పంపిణీ చేశారు. అనంతరం అంబేద్కర్ యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు మద్దెల రవి అధ్యక్షతన నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. అంబేద్కర్ ఆశయాల కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.
పదవులు శాశ్వతం కాదని.. ప్రజల మధ్య జీవించడం చాలా గొప్పతనమని పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయాలు కోసం నిరంతరం పరితపిస్తున్నాని అన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం వ్యవస్థాపకులు మద్దెల రవి, తెలంగాణ రాష్ట్ర మార్క్ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రారాజశేఖర్, వైరా మున్సిపల్ చైర్మన్ సూత కాని జైపాల్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పువ్వాళ దుర్గాప్రసాద్, మున్సిపల్ కౌన్సిలర్లు దారెల్లి పవిత్ర కుమారి, ఎదునూరి పద్మజ, గుగులోత్ లక్ష్మీబాయి, ఇమ్మడి రామారావు, గుడిపూడి సురేష్, కొణిజర్ల ఎంపీపీ గొస్ మధు, మాజీ మార్కెట్ చైర్మన్ గుమ్మ రోశయ్య, పీసీసీ కార్యదర్శి కట్ల రంగారావు, సీపీఐ మండల నాయకులు గోపాలరావు, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు కంకణాల అర్జున్ రావు, యువజన సంఘం బాధ్యులు తుమ్మల చిన్ని నండ్రు నాగరాజు, గొల్లమందల విజయ్ కుమార్, నండ్రు గోపి ప్రసాదు, శివ కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.