యూపీలో అఖిలేష్ కూటమే అధికారంలోకి.. ఆర్‌ఎల్‌డీ ఛీఫ్ జయంత్ చౌదరీ

by Harish |
యూపీలో అఖిలేష్ కూటమే అధికారంలోకి.. ఆర్‌ఎల్‌డీ ఛీఫ్ జయంత్ చౌదరీ
X

లక్నో: యూపీ ఎగ్జిట్ పోల్స్‌ను సమాజ్ వాదీ పార్టీ మిత్రపక్షం రాష్ట్రీయ్ లోక్ దళ్(ఆర్ఎల్‌డీ) చీఫ్ జయంత్ చౌదరీ తిరస్కరించారు. గురువారం వెలువడనున్న ఫలితాల్లో తమ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అన్నారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. 'ప్రచారంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నాం. దానికి అనుగుణంగా నెరవేరుస్తామని హామీ ఇచ్చాం. ప్రజలు వారి ఓటు ఇచ్చారు. ఈవీఎంలు లెక్కింపు జరిగే వరకు ఎవ్వరూ ఫలితాలు చెప్పలేరు. ఎగ్జిట్ పోల్స్‌కు ఒక విధానం ఉంటుంది. నేను ఓటింగ్ కేంద్రాల వద్ద ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన వ్యక్తులను చూడలేదు. ఎగ్జిట్ పోల్స్ విధానాన్ని నేను ఆమోదించను' అని అన్నారు.

ప్రచారం సమయంలో ప్రజల నిబద్ధతతో పాటు ఉత్సాహం కనిపించిందని, మా కూటమి పట్ల వారిలో విశ్వాసం ఉందని, అయితే సర్వేలో విభిన్న ఫలితాలు వచ్చాయని ఆర్ఎల్‌డీ చీఫ్ తెలిపారు. ఎగ్జిట్ పోల్స్‌తో ప్రజల్లో ఒక రకమైన ఒత్తిడిని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. కానీ, ఈ సారి యూపీలో తమ కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అన్నారు. కొందరు యూపీకి మేలు చేయడం మరిచి, బుల్డోజర్ల చుట్టూ తిరిగారని సీఎం యోగిపై పరోక్షంగా వ్యంగ్యాస్త్రాలు విసిరారు. కాగా, ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీజేపీ తిరిగి అధికారంలోకి రానుండగా, అఖిలేష్ యాదవ్ కూటమి రెండో స్థానంలో నిలుస్తుందని పేర్కొన్నాయి.

Advertisement

Next Story

Most Viewed