సమస్యల సత్వర పరిష్కారానికి ప్రజావాణి.. ఆదేశాలిచ్చిన అదనపు కలెక్టర్

by Disha News Desk |
సమస్యల సత్వర పరిష్కారానికి ప్రజావాణి.. ఆదేశాలిచ్చిన అదనపు కలెక్టర్
X

దిశ , సంగారెడ్డి : ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వేగవంతంగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు.కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి రాధిక రమణిలతో కలిసి స్థానిక సంస్థల అధనపు కలెక్టర్ రాజార్షి షా ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వారు సమస్యల అర్జీలను ఇచ్చారు. ప్రజలు ఎక్కువగా ధరణికి సంబంధించిన సమస్యలు, ఆసరా పెన్షన్ మంజూరు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, ఉపాధి కల్పన తదితరాలపై అర్జీలను అందజేశారు.

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న సమస్యలకు అధిక ప్రాధాన్యతనిచ్చి పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. వచ్చిన ఫిర్యాదులకు సంబందించి ఆయా శాఖల జిల్లా అధికారులు తక్షణమే పరిష్కరించేలా ప్రత్యేక చొరవ చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి రాధిక రమణి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story