ఇది మంచి నూనెనా, కల్తీ నూనెనా... ఎలా గుర్తుపట్టాలి?

by S Gopi |   ( Updated:2022-07-06 02:18:29.0  )
ఇది మంచి నూనెనా, కల్తీ నూనెనా... ఎలా గుర్తుపట్టాలి?
X

దిశ, వెబ్ డెస్క్: నిత్యావసరాల్లో ఒకటి మంచి నూనె. దీంతో మనం వంట చేసుకుంటాం. నూనె కల్తీదైతే మనం అనారోగ్యం పాలవుతాం. అయితే, మార్కెట్ లో చాలా రకాలైనటువంటి నూనె లభ్యమవుతుంది. ఆ కంపెనీలు తమది బెస్ట్ తమది బెస్ట్ అని చెబుతుంటారు. కొంతమంది ఆ నూనె మంచి నూనేనా లేక కల్తీ నూనెనా అనేది ఈజీగా గుర్తుపట్టేస్తారు. కానీ, ఇంకొంతమందికి అది సాధ్యంకాకపోవొచ్చు. ఆ నూనె క్వాలిటీ ఏంటో తెలుసుకునేందుకు ఇంట్లోనే సులువుగా తెలుసుకునే అవకాశముందని చెబుతున్నారు పలువురు ప్రముఖులు. అదెలాగు అంటే... మొదటగా రెండు రకాల బ్రాండ్ల నూనెను తీసుకోవాలి. ఆ తర్వాత రెండు గ్లాసుల్లో కొంచెం కొంచెం తీసుకోవాలి. దానిని ఓ ఫ్రిడ్జ్ లో పెట్టాలి. కొద్దిసేపు అయిన తర్వాత దానిని ఓపెన్ చేసి చూస్తే ఆ గ్రాసుల్లో ఉన్న నూనె ఏది గడ్డ కట్టితే అది కల్తీ నూనె, ఏ గ్లాసులో నూనె అలాగే ఉంటే ఆ నూనె మంచి నూనె అని గుర్తుపట్టాలని ప్రముఖులు చెబుతున్నారు. ఇలా ఈజీగా నూనె క్వాలిటీని చెక్ చేసుకునే అవకాశముందంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed