‘ఆశక్తి సామ్రాజ్యాలను నాశనం చేయగలదు’.. హైప్ పెంచేస్తోన్న సీనియర్ హీరోయిన్ న్యూ సిరీస్ ట్రైలర్ (పోస్ట్)

by Kavitha |
‘ఆశక్తి సామ్రాజ్యాలను నాశనం చేయగలదు’.. హైప్ పెంచేస్తోన్న సీనియర్ హీరోయిన్ న్యూ సిరీస్ ట్రైలర్ (పోస్ట్)
X

దిశ, సినిమా: అలనాటి స్టార్ హీరోయిన్ టబు గురించి స్పెషల్‌గా చప్పనక్కర్లేదు. తన అందం, నటనతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ భామ.. ఇప్పుడు సెకెండ్ ఇన్నింగ్స్‌లోనూ సత్తా చాటుకుంటుంది. కెరీర్ స్టార్టింగ్ టాలీవుడ్ స్టార్ హీరోల పక్కన హీరోయిన్‌గా జత కట్టిన ఈ నటి.. ఇప్పుడు కూడా హీరోయిన్‌గా నటిస్తూ తన గ్లామర్ ఏమాత్రం తగ్గలేదంటూ యంగ్ హీరోయిన్లకి గట్టి పోటీ ఇస్తోంది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ప్రస్తుతం ఈ బ్యూటీ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

‘మా ప్రపంచం నుంచి సోదరీమణులకు ప్రతీ గుర్తును చెరిపేయాలనుకుంటున్నాం. దాని కోసం ఓ గొప్ప శక్తిని నాకు బహుమతిగా ఇచ్చారు’ అంటూ తన రాబోయే హాలీవుడ్ వెబ్‌సిరీస్ ‘డ్యూన్: ప్రాపసీ’ ప్రపంచాన్ని పరిచయం చేసింది బాలీవుడ్ నటి టబు. ఇందులో సిస్టర్ ఫ్రాన్సెస్కా అనే ఓ శక్తివంతమైన పాత్రలో కనిపించనుందామె. డయాన్ అడెముజాన్, అలిసన్ షాప్‌కర్ దీన్ని రూపొందిస్తున్నారు. తాజాగా ఈ సిరీస్ రిలీజ్ డేట్‌ను తెలుపుతూ.. ట్రైలర్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘ఆశక్తి సామ్రాజ్యాలను నాశనం చేయగలదు’ లాంటి సంభాషణలతో సాగుతున్న ఈ ట్రైలర్ ఈ సిరీస్‌పై మరింత హైప్ పెంచుతోంది. ‘సిస్టర్ హుడ్ ఆఫ్ డ్యూన్’ అనే నవల ఆధారంగా తీర్చిదిద్దిప ఈ సిరీస్‌లో.. మనిషి మనుగడకు ముప్పు తెచ్చే శక్తులతో హర్కొనెస్ సిస్టర్స్ ఎలా పోరాడారనేది చూపించనున్నారు. కాగా ఈ సిరీస్ నవంబర్ 18న విడుదల కానుంది.

(video link credits to tabu, jio cinema instagram id's)

Advertisement

Next Story

Most Viewed