- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గుజరాత్‌లో 58 సీట్లు గెలుస్తాం.. AAP
గాంధీనగర్: గుజరాత్‌లో తాము 58 సీట్లు గెలువబోతున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ తెలిపింది. ఆప్ అంతర్గత సర్వేలో శాస్త్రీయంగా తేలినట్లు ఆప్ గుజరాత్ ఇంఛార్జ్ సందీప్ పఠాక్ వెల్లడించారు. సర్వే ప్రకారం పార్టీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి ఓట్లు రానుండగా, పట్టణ ప్రాంతాల్లో దిగువ, మధ్య తరగతి ఓట్లు పడనున్నట్లు పేర్కొంది. 'మా అంతర్గత సర్వే ప్రకారం, ఇప్పుడు మేం 58 సీట్లు గెలుస్తాం.
గ్రామీణ గుజరాత్ ప్రజలు మాకు ఓట్లు వేస్తున్నారు. అంతేకాకుండా పట్టణ ప్రాంతాల్లోని దిగువ, మధ్య తరగతి ప్రజలకు ఓట్లతో మార్పు కోరుకుంటున్నారు. బీజేపీని కాంగ్రెస్ ఓడించదలేని గ్రామీణ ప్రజలు భావిస్తున్నారు. గుజరాత్ గ్రామీణ కాంగ్రెస్ ఓటర్లు మా వైపు మళ్లారు. ప్రస్తుతానికి ఈ విధంగా ఉంది. ఇంకా రానున్న కాలంలో మరిన్ని పెరిగే అవకాశం ఉంది' అని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర ఇంటెలిజెన్స్ వింగ్ ఈ మధ్య చేపట్టిన సర్వేలో ఆప్‌కు 55 సీట్లు వచ్చాయని తెలిపారు. ఈ మధ్యలో పంజాబ్ లో గెలిచి ఊపు మీద ఉన్న ఆప్ ప్రభుత్వం గుజరాత్, ఉత్తరాఖండ్ లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలసిందే. దానికి తగినట్లుగానే ప్రచార ఏర్పాట్లు చేస్తుంది.