- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిండు గర్భిణిపై నుంచి దూసుకెళ్లిన ట్రక్కు.. క్షేమంగా ఉన్న శిశువు
by Manoj |
X
దిశ, వెబ్డెస్క్: ఇటీవల ప్రమాదాలు భారీగా పెరిగిపోతున్నాయి. అతివేగంగా ఒకరు, నిర్లక్ష్యంగా మరొకరు వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఇలాంటి వార్తలు మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. అయితే, ఒక్కోసారి చిన్న ప్రమాదానికే అనేకమంది చనిపోతుండగా.. కొన్నిసార్లు అదృష్టం బాగుండి అతిపెద్ద ప్రమాదం సంభవించినా అందరూ సురక్షితంగా బయటపడుతుంటారు. తాజాగా.. ఇలాంటి ఘటనే యూపీలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. 8 నెలల గర్భిణి తన భర్తతో కలిసి బైక్పై వెళ్తుండగా అదుపుతప్పి కిందపడ్డారు. అదే సమయంలో అటువైపు వస్తోన్న భారీ ట్రక్కు ఆమెపై నుంచి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో గర్భిణి చనిపోగా.. కడుపులో ఉన్న శిశువు, ఆమె భర్త క్షేమంగా బయటపడ్డారు. ప్రస్తుతం పాపకు చికిత్స అందిస్తున్నామని వైద్యులు వెల్లడించారు.
Advertisement
Next Story