FPIs: స్టాక్ మార్కెట్ల నుంచి రూ. 26,533 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్న విదేశీ ఇన్వెస్టర్లు..!

by Maddikunta Saikiran |   ( Updated:2024-11-24 13:29:46.0  )
FPIs: స్టాక్ మార్కెట్ల నుంచి రూ. 26,533 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్న విదేశీ ఇన్వెస్టర్లు..!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Markets) గత కొన్ని నెలలుగా ఎక్కువ శాతం నష్టాల్లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈక్విటీ షేర్ల(Equity Shares)లో విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్లు(FPI) తమ పెట్టుబడులను క్రమంగా తగ్గించుకుంటున్నారు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్(Donald Trump) మరోసారి ఎన్నికవ్వడం, చైనా మార్కెట్(China Market)లలో షేర్లు ఆకర్షణీయంగా ఉండటంతో విదేశీ మదుపర్లు మన మార్కెట్ల నుంచి నిధులు ఉపసంహరించుకుంటున్నారు. నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్(NSDL) గణాంకాల ప్రకారం ఈ నెల(నవంబర్)లో ఇప్పటివరకు ఫారిన్ ఇన్వెస్టర్లు ఏకంగా రూ.26,533 కోట్ల విలువైన పెట్టుబడులను కోట్ల బ్యాక్ తీసుకున్నారు. దీంతో ఈ ఏడాదిలో ఇప్పటివరకు FPI ఔట్ ఫ్లో ఏకంగా రూ.19,940 కోట్లకు చేరుకుంది. కాగా సెప్టెంబర్‌లో విదేశీ ఇన్వెస్టర్లు రూ.57,724 కోట్లతో పెట్టుబడులు పెట్టగా.. అక్టోబర్లో మాత్రం రూ. 94,017 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed