జాలర్లు షాక్.. చెరువులో చిక్కిన వింత చేప

by Vinod kumar |
జాలర్లు షాక్.. చెరువులో చిక్కిన వింత చేప
X

దిశ, దమ్మపేట : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం అప్పారావుపేట గ్రామంలో వింత చేప మత్స్యకారులకు వలకు చిక్కింది. అప్పారావుపేట గ్రామ శివారులో ఉన్న పెద్ద చెరువులో మంగళవారం ఉదయం చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు ఈ వింత చేప వలకు చిక్కింది.. గోధుమ రంగు నల్ల మచ్చలతో ఉన్న చేప పెద్ద పెద్దగా అరుస్తుంది, ఈ చేప నోరు కూడా అన్నీ చేపలకు భిన్నంగా కింది భాగంలో ఉంది. ఈ వింత చేప చూసేందుకు చుట్టుపక్కల గ్రామ ప్రజలు పోటెత్తారు. ఇలాంటి వింత చేపను ఎప్పుడూ చూడలేదని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ వింత చేపను సక్కర్ మౌంత్ జాతికి సంబంధించిన చేపగా తెలుస్తుంది.



Advertisement

Next Story

Most Viewed