- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆ విషయంలో భార్యకు అన్యాయం.. పిల్లలతో వాటర్ ట్యాంక్ ఎక్కిన తల్లి
దిశ, తిరుమలాయపాలెం : ఆస్తి పంపకాల విషయమై ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో వాటర్ ట్యాంక్ ఎక్కి ఆందోళన చేసింది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని తిరుమలాయపాలెం గ్రామానికి చెందిన రవి, సుజాతకు 15 ఏండ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఉజ్వల, వెంకట్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.గత కొన్నేళ్లుగా సుజాత, రవి విడిగా ఉంటున్నారు.
పిల్లలు ఇద్దరు సుజాత వద్ద, ఆమె స్వగ్రామమైన కూసుమంచిలో అమ్మమ్మ వాళ్ళ ఇంటి వద్ద ఉంటున్నారు. ఆస్తి పంపకాల విషయంలో తరుచూ గొడవలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఈ విషయమై మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం పక్కన ఉన్న వాటర్ ట్యాంకు పైకి, సుజాత తన ఇద్దరు పిల్లలతో ఎక్కి ఆందోళన చెప్పటింది. ఎమ్మార్వో పుల్లయ్య, ఎంపీడీవో జయరాం, ఎస్ఐ గిరిధర్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని చరవాణిలో ద్వారా సుజాతతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో కిందకు దిగి వచ్చారు.