- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టైంకి ఆ సిబ్బంది రావడంతో తప్పిన పెను ప్రమాదం!
by Web Desk |
X
దిశ, అమరచింత: మండల కేంద్రంలోని ఇండియన్ పెట్రోల్ బంక్ పక్కనే గురువారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇండియన్ పెట్రోల్ బంక్ కు విద్యుత్ సరఫరా చేసే ఎలక్ట్రిక్ పోల్ వద్ద షార్ట్ సర్క్యూట్ కావడంతో నిప్పు రవ్వలు కింద ఉన్న చెట్లపై పడడంతో మంటలు చెలరేగాయి. దీంతో ఆర్ అండ్ బీ రోడ్డు పక్కన ఉన్న చెట్లు అగ్నికి ఆహుతి అవుతున్న సమయంలో అటుగా వెళుతున్న 'దిశ' రిపోర్టర్ గమనించి, కంట్రోల్ రూమ్ కి కాల్ చేసి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించాడు. వెంటనే అప్రమత్తమైన ఎస్ఎఫ్ వో శ్రీనివాస్ రావు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేయడం తో మిగతా హరితహారం మొక్కలతో పాటు పెట్రోల్ బంక్ కు ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. మంటలను అదుపు చేసిన వారిలో ఫైర్ సిబ్బంది నర్సింహ రెడ్డి, వెంకటేశ్వర్లు, గోపాల్ రెడ్డి పాల్గొన్నారు.
Advertisement
Next Story