కృష్ణపట్టి అడవిలో భారీ అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న అగ్ని జ్వాలలు..

by Satheesh |   ( Updated:2022-03-22 17:33:56.0  )
కృష్ణపట్టి అడవిలో భారీ అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న అగ్ని జ్వాలలు..
X

దిశ, తిరుమలగిరి (సాగర్): తిరుమలగిరి (సాగర్) మండలంలోని మూలతండ, చెంచువాని తండా గ్రామాలకు రెండు కిలోమీటర్ల పరిధిలో ఉన్న అడవిలో రాత్రి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. మూలతండా, చెంచువాని తండా గ్రామాలకు సమీపాన రెండు నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో కృష్ణపట్టి అడవిలో అగ్ని ప్రమాదం జరిగిందని తెలిపారు. మంటలు భారీగా చెలరేగడంతో వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించినట్లు పేర్కొన్నారు. మంటలు సుమారు 100 నుండి 150 ఎకరాల్లో వ్యాపించి పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నట్లు సమాచారం. దీంతో సమీప తండావాసులు భయాందోళనలకు గురవుతూ బిక్కుబిక్కుమంటున్నారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story