ఆకాశంలోంచి దూసుకొచ్చిన ఉల్కాపాతం.. చిలీలో అరుదైన దృశ్యం! (వీడియో)

by Sumithra |   ( Updated:2023-03-20 18:39:30.0  )
ఆకాశంలోంచి దూసుకొచ్చిన ఉల్కాపాతం.. చిలీలో అరుదైన దృశ్యం! (వీడియో)
X

దిశ‌, వెబ్‌డెస్క్ః ఉల్కాపాతాలు భూమిని స‌మీపిస్తున్న దృశ్యాన్ని చూడ‌టం చాలా మందికి అరుదుగానే సంభ‌విస్తుంది. న‌ల్ల‌ని ఆకాశాన్ని వెలిగిస్తూ వ‌చ్చే ఉల్కాపాతాన్ని చూడటం అత్యంత అధివాస్తవిక అనుభవాల్లో ఒకటిగా అనిపిస్తుంది. ఇటీవ‌ల‌ చిలీ రాజధాని శాంటియాగోలో నివసిస్తున్న ఖగోళ శాస్త్ర ఔత్సాహికులు ఇలాంటి ఓ ప్రకాశవంతమైన ఉల్కను చూశారు. నివేదికల ప్రకారం, మంత్రముగ్ధులను చేసే ఈ దృశ్యాన్ని కాన్సెప్సియన్ విశ్వవిద్యాలయంలోని నిపుణులు ధృవీకరించారు. ఆ ఉల్క భూమి వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు కాలిపోయిందని చెప్పారు.

జూలై 7న ఇది సంభ‌వించింది. నగరం అంతటా ఉన్న‌ వివిధ కెమెరాలు దాని కదలికలను ట్రాక్ చేశాయి. స్థానిక మీడియా క‌థ‌నాల‌ ప్రకారం, ఆ ఉల్కాపాతం అండీస్ ప్రాంతంలో అదృశ్యమయ్యే ముందు అది చాలా భాగాలుగా విడిపోయిందని అధికారులు తెలిపారు. బ్రెజిలియన్ మీడియా అవుట్‌లెట్ TNH1 నివేదిక ప్రకారం, ఉల్క భూమిపైకి దూసుకొస్తున్న స‌మ‌యంలో నగరవాసులు ఉరుము లాంటి శ‌బ్దం విన్న‌ట్లు పేర్కొన్నారు. ఇక‌, చిలీ ఆస్ట్రానమీ ఫౌండేషన్‌కు చెందిన ఖగోళ శాస్త్రవేత్త జువాన్ కార్లోస్ బీమిన్ ప్ర‌కారం, శాంటియాగోను దాటిన ఈ ఉల్కాపాతాన్ని 'T12.cl' అని పిలుస్తారని తెలుస్తుంది.

Advertisement

Next Story

Most Viewed