'777 చార్లి' లాభాల్లో 5 శాతం ఇండీ డాగ్స్‌కు విరాళం..

by S Gopi |
777 చార్లి లాభాల్లో 5 శాతం ఇండీ డాగ్స్‌కు విరాళం..
X

దిశ, సినిమా : కన్నడ నటుడు రక్షిత్ శెట్టి హీరోగా నటించిన '777 చార్లి' మూవీ ఇటీవలే విడుదలై ప్రేక్షకుల ప్రేమను దక్కించుకుంది. కుక్కకు, మనిషికి మధ్య ఉండే అనుబంధాన్ని హృద్యంగా తెరకెక్కించిన దర్శకుడు కిరణ్ రాజ్‌కు ఈ సినిమా మంచి పేరు తీసుకొచ్చింది. తాజాగా ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్న చిత్రబృందం ఆసక్తికర ప్రకటన చేసింది. '777 చార్లి' నిర్మాతలు ఈ సినిమాకు వచ్చిన లాభాల్లో 5శాతం ఇండీ డాగ్స్‌తో పాటు ఇతర జంతువుల సంక్షేమం కోసం దేశవ్యాప్తంగా అంకితభావంతో పనిచేస్తున్న NGOలకు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడిన హీరో రక్షిత్.. 'ఈ చిత్రం ఎన్ని ప్రశంసలు, ఎంతటి గుర్తింపు తెచ్చిపెట్టిందో ఊహించుకుంటే ఆనందంగా ఉంది. అందుకే ఈ మూవీ చివరి వరకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కలెక్షన్ లాభాల్లో 10% అందజేస్తాం' అని తెలియజేశాడు.

Advertisement

Next Story