Aloe vera: అలోవెరాతో 5 అమేజింగ్ బెనిఫిట్స్.. ఏంటంటే..?

by Anjali |   ( Updated:2024-10-22 10:28:09.0  )
Aloe vera: అలోవెరాతో  5 అమేజింగ్ బెనిఫిట్స్.. ఏంటంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: అలోవెరా (Aloe vera ) ప్రయోజనాలు అనేకం. కలబందతో కాలిన గాయాలు నయమవుతాయి. దీనిలోని పోషకాలు ఆరోగ్య సమస్యలు రాకుండా శరీరాన్ని కాపాడుతుంది. జీర్ణవ్యవస్థ (digestive system ) ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలోవెర రసాన్ని తాగితే చర్మం మెరిసిపోతుంది. మంచి నోటి పరిశుభ్రతను ప్రోత్సహిస్తుంది. కలబంద చాలా మంది ఫేస్ కు అప్లై చేస్తారు. దీంతో వృద్ధాప్యంలో కూడా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఇది హెయిర్ (Hair )కు కూడా బాగా పనిచేస్తుంది. అయితే కలబందతో 5 అమేజింగ్ ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

పింపుల్స్‌ మాయం..

కలబందలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఇది పింపుల్స్ కు చెక్ పెట్టడంలో బాగా ఉపయోగపడుతుంది. ముఖంపై ఉన్న పింపుల్స్ కు కారణమయ్యే బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది కూడా.

చికాకు దూరం..

కలబంద చర్మానికి ఒక వరం అని చెప్పుకోవచ్చు. అలోవెరాను అందరూ సహజసిద్ధమై ఔషధంగా పిలుస్తారు. ఇది స్కిన్ పై వాపును తగ్గించడంలో మేలు చేస్తుంది. చికాకును దూరం చేస్తుంది. ముఖంపై ఎరుపును తగ్గించడంలో సహాయపడుతుంది.

స్కాల్ప్ సమస్యలకు చెక్..

కలబంద చుండ్రుకు అలోవెరా బెస్ట్ మెడిసిన్. అలాగే తలలో దురదతో ఇబ్బందిపడుతోన్న వారు కూడా కలబంద పెట్టుకుంటే దురద తగ్గుతుంది. చండ్రు కూడా మటుమాయం అవుతుంది.

ఇమ్మూనిటి పవర్‌ను పెంచుతుంది..

యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఏండే కలబంద రోగనిరోధక శక్తి(Immunity power )ని పెంచుతుంది. శరీర వ్యాధులతో పోరాడటానికి మేలు చేస్తుంది. బాడీ యాక్టివ్ గా ఉంచడంలో తోడ్పడుతుంది.

మలబద్ధకాన్ని నివారిస్తుంది..

సహజ ఔషధం కలబంద మలబద్ధకాన్ని నివారించడంలో మంచి మెడిసిన్‌గా పనిచేస్తుంది. అలోవెరా జ్యూస్ లా చేసుకుని తాగితే మలబద్ధకం(Constipation ) నుంచి ఉపశమనం పొందవచ్చు.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు.కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed