- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
1982లో 'నాబార్డ్' స్థాపించబడింది..
దిశ, ఫీచర్స్: 'నాబార్డ్(నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్)' 1982 జులై 12న స్థాపించబడింది. ఇది భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాలకు స్థిరమైన ఉపాధిని అందించడానికి NABARD యాక్ట్ 1981 సిద్ధాంతాల ప్రకారం ప్రభుత్వంచే నిర్మించబడింది. గ్రామీణ సంఘాలకు రుణాలు ఇవ్వడం, సంపన్నమైన, స్థిరమైన జీవితాలను గడపేందుకు ప్రజలకు అవకాశాలను అందించడం దీని ముఖ్య కర్తవ్యం. వ్యవసాయం, ఆర్థిక అభివృద్ధిలో విధాన రూపకల్పన, ప్రణాళిక కార్యకలాపాలు సహా అనేక బాధ్యతలను కలిగి ఉంది.
అలాగే నివాసితులకు మౌలిక సదుపాయాలు, ఉద్యోగ అవకాశాలను పెంపొందించడానికి వ్యవసాయం, కుటీర పరిశ్రమలు, ఇతర చిన్న తరహా పరిశ్రమలు, గ్రామీణ హస్తకళలు వంటి మానవ నిర్మిత సంస్థలకు మద్దతు ఇవ్వడం, వృద్ధి చేయడం వంటి వాటిని నాబార్డ్ సమర్ధవంతంగా నెరవేరుస్తుంది. ఇక గ్రామీణ జనాభాకు అవకాశాలను అందించడం ద్వారా ప్రజల శ్రేయస్సు, సంపద, అభివృద్ధి మెరుగుపడుతుందని వెల్లడించింది.