- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Raghavendra Rao: రెండేళ్లలో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయం: కే రాఘవేంద్రరావు
దిశ, ఏపీ బ్యూరో : Director Raghavendra Rao says, TDP will come to rule in two years| నా సినీ జన్మకు దివంగత సీఎం ఎన్టీఆరే కారణమని సినీదర్శకుడు కే రాఘవేంద్రరావు తెలిపారు. ఎన్టీఆర్ వల్లే తాను ఈరోజు ఈ స్థాయికి చేరుకున్నట్లు రాఘవేంద్రరావు వెల్లడించారు. ఆదివారం సాయంత్రం ఉమ్మడి గుంటూరు జిల్లా తెనాలిలో జరుగుతున్న ఎన్టీఆర్ శతాబ్ది ఉత్సవాలలో భాగంగా రాఘవేంద్రరావుకు ఎన్టీఆర్ శతాబ్ది చలన చిత్ర పురస్కారాన్ని ప్రదానం చేశారు. నాజరుపేటలోని ఎన్‌వీఆర్ కన్వెషన్‌లో మాజీమంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సభలో రాఘవేంద్రరావు మాట్లాడారు. ఈ పురస్కారాన్ని పైలోకంలో ఉన్న ఎన్టీఆర్ పంపినంత ఆనందంగా ఉందని రాఘవేంద్రరావు తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
రాష్ట్రంలో మరో రెండేళ్లలో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని దర్శకుడు కె.రాఘవేంద్రరావు జోస్యం చెప్పారు. ప్రజల్లో రోజురోజుకు తెలుగుదేశం పార్టీపై ఆదరణ పెరుగుతోందని, చంద్రబాబు అధికారంలోకి రావడం పక్కా అని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాపట్ల జిల్లా చుండూరు మండలం నడిగడ్డపాలెంలో అభిమానులు ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని రాఘవేంద్రరావు ఆవిష్కరించారు. దార్శనికుడైన ఎన్టీఆర్ అడుగుజాడల్లో నేతలు నడవాలని సూచించారు. సినీ రంగంలోకి తాను అడుగుపెట్టడానికి మూల కారణం ఎన్టీఆర్ అని చెప్పుకొచ్చారు. ఏడాది పాటు తెనాలిలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు చేయడం అభినందనీయమని కొనియాడారు. 1963లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా భీముని పాత్ర పోషిస్తున్న ఎన్టీఆర్‌కు క్లాప్ కొట్టానని.. ఆతర్వాత ఆయనతో తీసిన 12 సినిమాలు బ్లాక్‌బస్టర్ అయ్యాయని రాఘవేంద్రరావు గుర్తు చేశారు.
- Tags
- Raghavendra Rao