Thank you Movie: థాంక్యూ మూవీ టికెట్ ధ‌ర‌లు.. తగ్గించిన ప్రొడ్యూసర్!

by Mahesh |   ( Updated:2022-07-18 13:21:11.0  )
Dil Raju Reduces Ticket Prices for Thank you Movie
X

దిశ, సినిమా: Dil Raju Reduces Ticket Prices for Thank you Movie| అక్కినేని నాగ‌చైత‌న్య మూడు డిఫ‌రెంట్ వేరియేష‌న్స్‌తో కూడిన క్యారెక్టర్స్‌లో క‌నిపించ‌బోతున్న చిత్రం 'థాంక్యూ'. విక్రమ్ కె కుమార్ ద‌ర్శక‌త్వం వహించిన ఈ చిత్రం జులై 22న రిలీజ్ కానుంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా టికెట్ ధరలు ఎలా ఉండనున్నాయి? అనే అంశంపై ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా ఈ సినిమా టికెట్ ధరలను భారీగా తగ్గిస్తున్నట్లు నిర్మాత దిల్ రాజు వెల్లడించారు. ప్రస్తుతానికి తెలంగాణ‌లోని మ‌ల్టీప్లెక్స్‌లో రూ. 300, సింగిల్ స్ర్కీన్స్‌లో రూ. 175గా టికెట్ ధ‌ర‌లు ఉన్నాయి. కానీ 'థాంక్యూ' సినిమాకు తెలంగాణలోని సింగిల్ స్క్రీన్స్‌లో రూ. 100 ప్లస్ జీఎస్టీ, మల్టీప్లెక్స్‌లో రూ.150 ప్లస్ జీఎస్టీగా టికెట్ ధర నిర్ణయించినట్లు తెలిపారు. కానీ ఏపీలో మాత్రం సింగిల్ స్క్రీన్స్‌లో టికెట్ ధరను ప్రభుత్వం రూ. 125 ప్లస్ జీఎస్టీగా నిర్ణయించిందని.. ఆ రేట్స్‌ను తగ్గించడం కుదరదని పేర్కొన్నారు. ఇక అక్కడి మ‌ల్టీప్లెక్స్‌లో టికెటల్ ధర రూ. 177గా ఉండబోతున్నట్లు తెలిపారు. ప్రేక్షకులు థియేటర్లకు రావాలన్న ఆలోచనతోనే ఈ ధరలు నిర్ణయించినట్లు దిల్ రాజు వెల్లడించారు.

ఇది కూడా చదవండి: సెక్సీ రెడ్డి.. పిచ్చెక్కిస్తున్నావ్ కదా! నటి బోల్డ్ షోపై దారుణమైన కామెంట్స్


Advertisement

Next Story