తమిళనాడు గవర్నర్‌గా రెబల్‌స్టార్?

by Ramesh Goud |   ( Updated:2021-01-07 04:19:18.0  )
తమిళనాడు గవర్నర్‌గా రెబల్‌స్టార్?
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ రెబల్‌ స్టార్ కృష్ణం రాజు బీజేపీలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఏనాడు పదవులపై వ్యామోహం చూపని ఆయనకు కీలక పదవి అప్పజెప్పనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. తమిళనాడు గవర్నర్‌గా కృష్ణం రాజునే నియమిస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జోరందుకుంది. దీనికి తోడు పలువురు సినీ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారు. దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రానప్పటికీ కృష్ణం రాజు తమిళనాడు గవర్నర్ అంటూ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ముఖ్యంగా ప్రభాస్ అభిమానులు అయితే మరింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story