- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కాంగ్రెస్, బీఆర్ఎస్ మ్యానిఫెస్టోకు తేడాలేంటి..? ఏ పథకానికి ఎంత?
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు 14 పేజీలతో బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను సీఎం కేసీఆర్ ఇవాళ విడుదల చేయగా.. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలకు పోటీగా ఇందులో భారీ హామీలు ఇచ్చారు. ఓటర్లను ఆకట్టుకోవడమే లక్ష్యంగా మ్యానిఫెస్టో నిండా సంక్షేమ పథకాలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలకు మించి కేసీఆర్ హామీలు ప్రకటించారు. ప్రధానంగా రైతులు, మహిళలు, పెన్షన్‌దారులు, బీపీఎల్ కుటుంబాలకు బీఆర్ఎస్ హామీలు ప్రకటించింది.
కాంగ్రెస్ రూ.500కే గ్యాస్ సిలిండర్ హామీ ఇవ్వగా.. బీఆర్ఎస్ రూ.400కే అందిస్తామని తెలిపింది. ఇక కాంగ్రెస్ మహిళలకు నెలకు రూ.2,500 భృతి ఇస్తామని చెప్పగా.. బీఆర్ఎస్ నెలకు రూ.3 వేలుగా ప్రకటించింది. కాంగ్రెస్ రైతుబంధు కింద ఎకరానికి రూ.15 వేలు ప్రకటించగా.. దశలవారీగా రూ.16 వేలకు పెంచుతామని బీఆర్ఎన్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇళ్లు లేనివారికి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల సాయం చేస్తామని ఆరు గ్యారెంటీలలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అయితే బీఆర్ఎస్ ఇప్పటికే అమలు చేస్తున్న గృహలక్ష్మి పథకం ద్వారా జాగా ఇవ్వడంతో పాటు రూ.3 లక్షల సాయం చేస్తామని తెలిపింది.
ఇక పింఛన్ విషయానికొస్తే.. రూ.4 వేలకు పెంచుతామని కాంగ్రెస్ చెప్పగా.. రూ.5 వేలకు పెంచుతామని బీఆర్ఎస్ హామీ ఇచ్చింది. కానీ దశలవారీగా ఫించన్ పెంచుతామని బీఆర్ఎస్ తెలిపింది. ఆరోగ్యశ్రీ కింద రూ.10 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తామని కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలలో పేర్కొనగా.. ఆరోగ్య రక్ష కింద రూ.15 లక్షలకు పరిమితి పెంచుతున్నట్లు బీఆర్ఎస్ హామీ ఇచ్చింది. వీటితో పాటు తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి బీమా సౌకర్యం, రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం. అనాథ పిల్లల కోసం ప్రత్యేక పాలసీ వంటి హామీలను కొత్తగా బీఆర్ఎస్ మేనిఫెస్టోలో పొందుపర్చింది.